Venkateswarlu
మొన్న తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దర్శకుడు మారి సెల్వరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తున్న మారిముత్తు చనిపోయారు...
మొన్న తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దర్శకుడు మారి సెల్వరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తున్న మారిముత్తు చనిపోయారు...
Venkateswarlu
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ రోజుల తేడాతో సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. గత నెల ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మధుమేహం, కిడ్నీల సమస్య, హృద్రోగంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. నవంబర్ 11న తుది శ్వాస విడిచారు. అంతకు ముందు మలయాళ ఇండస్ట్రీలో టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రాణాలు తీసుకున్నారు.
రెండు రోజుల క్రితం తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ ఒకరు చనిపోయారు. కర్ణన్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన మారి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారిముత్తు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. రాత్రి భోజనం తర్వాత సిగరెట్ తాగిన కొద్దిసేపటికే దగ్గు వచ్చింది. ఆ వెంటనే ఆయనకు ఊపిరాడ లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మారిముత్తు మరణించినట్లు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు.
ఇలా వరుస విషాదాలతో సతమతమవుతున్న చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి చనిపోయారు. ఆమె గత కొంత కాలంగా వయో భార సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సుబ్బలక్ష్మి అక్కడ గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. 87 ఏళ్ల వయసులో ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. సుబ్బలక్ష్మి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు.
తమిళంలో విన్నయ్ తాండి వరువాయా, అమ్మని, హౌస్ ఓనర్, బీస్ట్, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళంలో స్టార్ హీరో దిలీప్ కుమార్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో నటించారు. సీఐడీ మూస, తిలకన్, కల్యాణ రామన్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సినిమా కల్యాణ రామన్ తెలుగులో కల్యాణ రాముడిగా తెరకెక్కింది. ఈ సినిమాలోనూ సుబ్బలక్ష్మీ నటించారు. ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సుబ్బులక్ష్మి నటిగానే కాదు.. సింగర్‌కూడా తన సత్తా చాటారు. ఆమె కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. ఇక, సుబ్బులక్ష్మి మరణంపై మలయాళ చిత్ర పరిశ్రమకు చెందని పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. సుబ్బులక్ష్మి మరణంపై తమ సంతాపం తెలుపుతున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, సుబ్బలక్ష్మి అంత్యక్రియలు ఈ రోజు ఆమె స్వగ్రామంలో జరగనున్నట్లు తెలుస్తోంది. మరి, బహుభాషా సీనియర్ నటి సుబ్బలక్ష్మీ మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.