కమల్ కాదు.. ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?

కమల్ కాదు.. ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన నటుడు ఎవరంటే? చాలా మంది కమల్ హాసన్ పేరే చెబుతారు. కానీ ఒకే మూవీలో అత్యధిక రోల్స్ చేసింది కమల్ కాదు. వేరే యాక్టర్ ఉన్నాడు. అతడు ఏకంగా ఒక సినిమాలో 45 పాత్రలు చేశాడు. అతడు ఎవరంటే?

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దిగ్గజ నటీ, నటులు ఉన్నారు. ధర్మేంద్ర, అమితాబ్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి లతో పాటుగా మరెందరో లెండరీ యాక్టర్లు ఉన్నారు. వారంతా ఎంతో గొప్ప గొప్ప పాత్రలు చేశారు. అయితే ఒక సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన నటుడు ఎవరంటే? చాలా మంది ఠక్కున విశ్వనటుడు కమల్ హాసన్ పేరే చెబుతారు. కానీ, ఒక మూవీలో ఎక్కువ పాత్రలు చేసింది కమల్ కాదు. వేరే నటుడు ఉన్నాడు. అతడు ఒక మూవీలో ఏకంగా 45 పాత్రలు పోషించాడు. మరి ఆ నటుడు ఎవరు? ఆ సినిమా ఏది? తెలుసుకుందాం పదండి.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు చేసే నటులు చాలా మందే ఉన్నారు. వారిలో కమల్ హాసన్ ముందువరుసలో ఉంటాడు. ఎలాంటి పాత్రలోనైనా ఆయన ఒదిగిపోయే తీరు అమోఘం. దశావతారం మూవీలో ఏకంగా 10 పాత్రల్లో కమల్ చూపించిన వైవిధ్యం అద్భుతం. దాంతో ఎక్కువ పాత్రలు చేసిన నటుడిగా కమల్ పేరే చెబుతారు సినీ లవర్స్. కానీ ఒక సినిమాలో అత్యధిక పాత్రలు చేసిన నటుడు కమల్ కాదు. అవును.. మీరు విన్నది నిజమే. ఒకే సినిమాలో ఎక్కువ పాత్రలు చేసింది జాన్సన్ జార్జ్ అనే మలయాళ నటుడు.

జాన్సన్ జార్జ్ అనే మలయాళ నటుడు 2018లో విడుదలైన ‘అరను జాన్’ సినిమాలో ఏకంగా 45 పాత్రలు పోషించాడు. గాంధీ, జీసస్, డావిన్సీ, వివేకానంద, హిట్లర్ లాంటి 45 పాత్రలు ఈ చిత్రంలో పోషించాడు. దాంతో ఒకే మూవీలో ఎక్కువ పాత్రలు పోషించిన నటుడిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇలా దేశంలో ఎంతో మంది దిగ్గజ నటులకు సాధ్యం కాని రికార్డును జాన్సన్ జార్జ్ తన పేరిట లిఖించుకున్నాడు. మరి ఒకే సినిమాలో 45 పాత్రలు పోషించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments