ప్రతి రంగంలోనూ వివాదాలు అనేవి సర్వసాధారణం. అయితే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖలకు సంబంధించిన వివాదాలు మాత్రమే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా సినిమా వాళ్ల ఇష్యూపై జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే సినిమాలు, రెమ్యూనరేషన్ విషయాల్లో నటులకు నిర్మాతలకు మధ్య వివాదాలు జరుగుతుంటాయి. అయితే అలాంటి ఓ వివాదం స్టార్ హీరో, ఓ నిర్మాత మధ్య వచ్చింది. అది కాస్తా కోర్టు వరకు వెళ్లింది. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఇష్యూపై తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి.. ఆ హీరో ఎవరు., ఆ వివాదం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
తమిళ నటుడు శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వల్లభ, మన్మథ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాలతో తెలుగు వారిని అలరించాడు. అయితే ఆతరువాత కొంతకాలనికి టాలీవుడ్ కు దూరమయ్యాడు. కేవలం తమిళ సినిమాలకే పరిమితమయ్యాడు. గతంలో శింబు పలు వివాదాలతో వార్తల్లో నిలిచాడు. నయనతారతో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. ఇలా తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతాడు.
ఇతడు కొన్నేళ్ల ముందు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కోసం రూ.9.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేట్లు ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.4.5 కోట్ల సదరు నిర్మాణ సంస్థ శింబుకు ఇచ్చింది. కోటి రూపాయలను బ్యాంక్ ద్వారా చెల్లించగా, మిగిలిన మొత్తం లిక్విడ్ క్యాష్ గా శింబు అందుకున్నాడు. అయితే అడ్వాన్స్ తీసుకున్న తరువాత.. సినిమా చేసే విషయంలో శింబు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో వేల్స్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వాటి పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. చాలా కాలం పాటు ఈ కేసుపై విచారణ సాగింది.
తాజాగా ఇరువురి వాదనలు విన్న మద్రాసు హైకోర్టు.. శింబుకి షాకిచ్చింది. బ్యాంక్ ద్వారా చెల్లించిన కోటి రూపాయల్ని నిర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. మిగిలిన మూడున్నర కోట్లకు సరైన ఆధారాలు లేని కారణంగా..తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఇష్యూ కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే శింబు సన్నిహితులు లేదా పీఆర్ టీమ్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నత న్యాయస్థానానికి వెళ్తారా? రాజీ కుదుర్చుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. మరి.. శింబు విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.