Aditya N
సైతాన్ సినిమాలో మాధవన్ పెర్ఫార్మన్స్ కు అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల వరకూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రూరత్వంతో నిండిన విలనిజంని అద్భుతంగా పండించారని, అజయ్, జ్యోతిక వంటి మేటి నటులను డామినేట్ చేశారని మాధవన్ నటనకు ప్రశంసలు లభించాయి.
సైతాన్ సినిమాలో మాధవన్ పెర్ఫార్మన్స్ కు అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల వరకూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రూరత్వంతో నిండిన విలనిజంని అద్భుతంగా పండించారని, అజయ్, జ్యోతిక వంటి మేటి నటులను డామినేట్ చేశారని మాధవన్ నటనకు ప్రశంసలు లభించాయి.
Aditya N
ఈ మహాశివరాత్రికి భారత దేశవ్యాప్తంగా దేవాలయాలతో పాటు థియేటర్లు కూడా నిండిపోయాయి. తెలుగు సినిమాలు గామి, భీమాతో పాటు ప్రేమలు అనే మలయాళ డబ్బింగ్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. వీటితో పాటు నిన్న బాలీవుడ్ లో హారర్ థ్రిల్లర్ సైతాన్ కూడా మంచి అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. ఇందులో అజయ్ దేవగణ్ తో పాటు మాధవన్, జ్యోతిక వంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉండటంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సినిమాకి బాగా అయ్యాయి. అయితే సైతాన్ ట్రైలర్ చూసిన వారందరూ మాధవన్ అజయ్, జ్యోతికలని డామినేట్ చేశారని అభిప్రాయపడ్డారు. కాగా నిన్న సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఏకగ్రీవంగా మాధవన్ షో అని అంటున్నారు.
గత ఏడాది గుజరాతి భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన వష్ అనే సినిమాకో సైతాన్ అఫిషియల్ రీమేక్ గా తెరకెక్కింది. కాగా బాక్సాఫీస్ బద్ద సుమారు 15 కోట్లకు పైగా ఓపెనింగ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ నటీనటుల గురించి మాత్రం అన్ని రివ్యూల్లో బాగా రాసారు ముఖ్యంగా క్రూరమైన విలన్ పాత్రలో మాధవన్ అవార్డ్ విన్నింగ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు. ట్రైలర్ లో చూసినట్టు ఫామ్ హౌజ్ లో ఫ్యామిలీ వీకెండ్ ఎంజాయ్ చేయాలని వెళ్లిన అజయ్ దేవగణ్ కుటుంబానికి మాధవన్ పరిచయమవుతాడు. సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందనే వంకతో ఇంట్లోకి చొరబడి వారి కూతురిని వశీకరణ ద్వారా తన అధీనంలోకి తీసుకుంటాడు. అతని బారి నుంచి తమ కూతురిని కాపాడుకోవడానికి అజయ్, జ్యోతికలు ఏం చేస్తారనేది మిగతా కథ.
సాదరణంగా సినిమాల్లో విలన్ పాత్రలు రొటీన్ గా ఉంటాయి. అయితే ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో సైకో పాత్రలు మాత్రం కొత్తగా ఉంటాయి. అలాంటి పాత్ర దక్కితే ఇంక మాధవన్ లాంటి నటుడు చెలరేగిపోవడం ఖాయం. సైతాన్ సినిమాలో అదే జరిగింది. మాధవన్ పెర్ఫార్మన్స్ కు అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల వరకూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రూరత్వంతో నిండిన విలనిజంని అద్భుతంగా పండించారని, అజయ్, జ్యోతిక వంటి మేటి నటులను డామినేట్ చేశారని మాధవన్ నటనకు ప్రశంసలు లభించాయి. నిజానికి తమిళ సినిమా నుంచి వచ్చిన మాధవన్… అప్పట్లో రెహానా హై తేరే దిల్ మే, తరువాత తను వెడ్స్ మను సీరీస్ లతో పాటు ఓటీటీలో ఢీకపుల్డ్, ది రైల్వే మేన్ వంటి షోలతో హిందీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సైతాన్ లో అసాధారణమైన నటనతో మరోసారి బాలీవుడ్ చూపు తన వైపు తిప్పుకున్నారు.