Amala Paul: కాలేజీ పిల్లల ముందు ఇలాంటి డ్రెస్‌లోనా? అమలాపాల్ పై ఓ రేంజ్ ట్రోల్స్!

Amala Paul... ఇటీవల తల్లిగా ప్రమోట్ అయ్యింది స్టార్ నటి అమలా పాల్. ఇదిలా ఉంటే.. ఆమె అప్ కమింగ్ మూవీ లెవల్ క్రాస్.. ఈ నెల 26న విడుదల అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ కాలేజీకి వెళ్లింది చిత్ర యూనిట్.

Amala Paul... ఇటీవల తల్లిగా ప్రమోట్ అయ్యింది స్టార్ నటి అమలా పాల్. ఇదిలా ఉంటే.. ఆమె అప్ కమింగ్ మూవీ లెవల్ క్రాస్.. ఈ నెల 26న విడుదల అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ కాలేజీకి వెళ్లింది చిత్ర యూనిట్.

మాలీవుడ్ నుండి వచ్చిన మరో అందం అమలా పాల్. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయ్యింది. మైనా మూవీతో మొదలైన ఆమె స్టార్ డమ్ కంటిన్యూ అవుతుంది. ఆ మధ్యలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ.. మళ్లీ నిలదొక్కుకుంది. గత ఏడాది రెండో పెళ్లి చేసుకుని తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఈ బ్యూటీఫుల్ యాక్ట్రెస్. అయితే ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది అమలా పాల్. మొన్నటి మొన్న ఓ హెయిర్ డ్రసెస్ తనను ఈ సౌత్ హీరోయిన్ అవమానించింది అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది అమలాపాల్. ఇటీవల ఆడు జీవితం మూవీతో సక్సెస్ అందుకున్న ఈ స్టార్ నటి.. లెవల్ క్రాస్ అనే మలయాళ మూవీ చేస్తుంది.

ఆసిఫ్ అలీ, అమలా పాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్ఫజ్ అయుబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. జులై 26వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఎర్నాకులం, కొచ్చిలోని సెయింట్ ఆల్బర్ట్ కాలేజీకి వెళ్లారు. అయితే అమల పొట్టి దుస్తులలో నెక్ లైన్‌తో దర్శనమిచ్చింది. బ్లాక్ డ్రెస్సుల్లో లో నెక్ డ్రెస్ ధరించడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ఓ కాలేజీకి ఇలా రావడంపై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది కాలేజీ అని గుర్తుపెట్టుకోవాలని, విద్యా సంస్థల్లోకి వచ్చేటప్పుడు డీసెంట్‌గా రావాలని, మినిమమ్ సెన్స్ ఉండాలంటూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె డ్రెస్ అసభ్యకరంగా, అనుచితంగా ఉందంటూ ఫైర్ అయ్యారు.

కాగా, ఈ దాడిపై అమలా పాల్ స్పందించినట్లు తెలుస్తుంది. తన దుస్తులపై వస్తున్న విమర్శల గురించి అమలా పాల్ మాట్లాడుతూ.. తనకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తుల్నే ధరించాను కానీ.. సరైనవా కాదా అని భావించలేదని పేర్కొంది. అంతేనా కెమెరా ప్రాబ్లమ్ అంటూ చెప్పుకొచ్చింది. ‘నేను నాకు సౌకర్యవంతంగా అనిపించినవి ధరించాను తప్ప.. ఈ ఫంక్షన్‌కి ఈ దుస్తులు సరైనది కాదు అని ఆలోచించలేదు. కెమెరాలు నా డ్రెస్సింగ్ స్టైల్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేసినట్లు ఉన్నాయి. నేను వేసుకున్న దుస్తులు పట్ల విద్యార్థులు అసౌకర్యంగా లేరు. నేను సంప్రదాయం, పాశ్చాత్య దుస్తులు ధరిస్తాను. ఏ దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే ఛాయిస్ వారికి ఉండాలనే విశ్వాసాన్ని విద్యార్థుల్లో నింపాలనుకుంటున్నాను’ అని పేర్కొంది. లెవల్ క్రాస్ కాకుండా అమలా ద్విజ అనే మూవీ చేస్తుంది.

Show comments