Jr NTR-Mr NTR: ఇకపై Jr NTR కాదు.. మిస్టర్ NTR! ఫ్యాన్స్ నోట్ చేసుకోండి!

ఇకపై Jr NTR కాదు.. మిస్టర్ NTR! ఫ్యాన్స్ నోట్ చేసుకోండి!

Jr NTR-Mr NTR: జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్చుకున్నారా.. ఇకపై ఆయనను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవకూడదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ వివరాలు..

Jr NTR-Mr NTR: జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్చుకున్నారా.. ఇకపై ఆయనను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవకూడదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ వివరాలు..

తాత నందమూరి తారక రామరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. నటనలో తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయన వారసుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా ఆ తాత ఈ మనవడికి ఎంతో ఇష్టంగా తన పేరే పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన నటన, డ్యాన్స్ తో తాత వారసుడిగా.. జూనియర్ ఎన్టీఆర్ గా అభిమానులు చేత పిలపించుకుంటున్నాడు. అయితే తాజాగా చేసిన కొన్ని ట్వీట్లు చూస్తే.. అభిమానుల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన పేరు మార్చుకుంటున్నారా.. జూనియర్ అని పిలవడం ఆయనకు ఇష్టం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే..

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పార్ట్ చిత్రీకరణ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా ముందు చెప్పిన తేదీలో రిలీజ్ అవుతుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తారక్ కు కారు ప్రమాదం జరిగింది అని వార్తలు రావడంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారు ప్రమాదంలో తారక్ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయ్యాయని.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే వాటిని ఖండిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో ఎన్టీఆర్ పేరును.. జూనియర్ ఎన్టీఆర్ అని కాకుండా.. మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేశారు. అలానే గతంలో ఓ భూవివాదానికి సంబంధించి.. క్లారిటీ ఇస్తూ.. మిస్టర్ ఎన్టీఆర్ అనే మెన్షన్ చేశారు. వరుసగా ఇలా రెండు సార్లు.. జూనియర్ ఎన్టీఆర్ అని కాకుండా మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేయడం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇది గమనించిన అభిమానులు, మూవీ లవర్స్.. జూనియర్ ఎన్టీఆర్ తన పేరును మార్చుకున్నాడని.. ఇకపై ఆయనను జూనియర్ ఎన్టీఆర్ అని కాకుండా.. మిస్టర్ ఎన్టీఆర్ అని పిలవాలని చెప్పకనే చెబుతున్నారంటూ డిస్కషన్ చేసుకుంటున్నారు. అందుకే ఈ రెండు ప్రెస్ నోట్ లలో మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేశారని చెబుతున్నారు. మరి దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు.

Show comments