Aditya N
గత రెండేళ్లుగా “బచ్చన్ పాండే,” “షెహజాదా,” “గణపత్,” “హమ్ దో హమారే దో,” “ఆదిపురుష్,” వంటి చిత్రాలతో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్న కృతి సనన్ "క్రూ" సినిమాతో చాలా అవసరమైన హిట్ ను అందుకున్నారు. ఇటీవలే ఆమె షాహిద్ కపూర్ సరసన నటించగా ఫిబ్రవరిలో విడుదలైన “తేరీ బాతో మే అయిసా ఉల్జా జియా” యావరేజ్ గా నిలిచింది. కానీ ఇప్పుడు, “క్రూ” హిట్ అయింది.
గత రెండేళ్లుగా “బచ్చన్ పాండే,” “షెహజాదా,” “గణపత్,” “హమ్ దో హమారే దో,” “ఆదిపురుష్,” వంటి చిత్రాలతో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్న కృతి సనన్ "క్రూ" సినిమాతో చాలా అవసరమైన హిట్ ను అందుకున్నారు. ఇటీవలే ఆమె షాహిద్ కపూర్ సరసన నటించగా ఫిబ్రవరిలో విడుదలైన “తేరీ బాతో మే అయిసా ఉల్జా జియా” యావరేజ్ గా నిలిచింది. కానీ ఇప్పుడు, “క్రూ” హిట్ అయింది.
Aditya N
బాలీవుడ్ లో తాజాగా విడుదలైన క్రైమ్ కామెడీ “క్రూ”. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్లు వసూలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. తొలి రోజున బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల నెట్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. టబు, కరీనా కపూర్ ఖాన్ తో పాటు కృతి సనన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ క్రైమ్ కామెడీ ఆకట్టుకునే స్టార్ కా, ట్రైలర్ తో పాటు హిట్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. “క్రూ” సినిమా తొలి రోజు అంచనాలను మించి భారతదేశంలో 10 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. రెండో రోజు కోడ్ దాదాపు అంతే కలెక్ట్ చేసి మూడో రోజైన ఆదివారం మరింత ఎక్కువ వసూళ్లు సాధించేందుకు సిద్ధంగా ఉంది.
అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోలు కూడా కోవిడ్ అనంతర కాలంలో ఇంత పెద్ద ఓపెనింగ్ సాధించడానికి చాలా కష్టపడ్డారు. అలాంటిది లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన ఒక సినిమా విజయం సాధించడం నిజంగా విశేషమే. గత రెండేళ్లుగా “బచ్చన్ పాండే,” “షెహజాదా,” “గణపత్,” “హమ్ దో హమారే దో,” “ఆదిపురుష్,” వంటి చిత్రాలతో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్న కృతి సనన్ “క్రూ” సినిమాతో చాలా అవసరమైన హిట్ ను అందుకున్నారు. ఇటీవలే ఆమె షాహిద్ కపూర్ సరసన నటించగా ఫిబ్రవరిలో విడుదలైన “తేరీ బాతో మే అయిసా ఉల్జా జియా” యావరేజ్ గా నిలిచింది. కానీ ఇప్పుడు, “క్రూ” హిట్ అయింది. అయితే, కృతితో పాటు, టబు, కరీనాలకి కూడా ఈ సినిమా విజయంలో క్రెడిట్ దక్కుతుంది.
అంతర్జాతీయంగా కూడా బాక్సాఫీస్ వద్ద “క్రూ” తనదైన ముద్ర వేసింది, 2024 సంవత్సరంలో యూఎస్ ప్రాంతంలో అత్యధిక ఓపెనింగ్ సాధించిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన “ఫైటర్” సినిమాని అధిగమించింది. అంచనాల ప్రకారం “క్రూ” మొదటి వారాంతంలో దాదాపు 35 కోట్ల ఆదాయాన్ని రాబట్టచ్చు అని అంటున్నారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం “క్రూ” సినిమా లైఫ్ టైమ్ బాక్సాఫీస్ కలెక్షన్ సుమారుగా 75 కోట్లకు చేరుకోవచ్చని అంటున్నారు. అక్షయ్ కుమార్ – టైగర్ ష్రాఫ్ ల “బడే మియా చోటే మియా” విడుదల వరకూ రన్ అవుతుంది కాబట్టి “క్రూ” సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లు కూడా వసూలు చేసే అవకాశం ఉంది.