Keerthi
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారిలో కోవై సరళ కూడా ఒకరు. కానీ, ఈ మధ్యకాలంలో ఆమె ఏ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. కాగా, ఇటీవలే బాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చిన కోవై సరళ.. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారిలో కోవై సరళ కూడా ఒకరు. కానీ, ఈ మధ్యకాలంలో ఆమె ఏ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. కాగా, ఇటీవలే బాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చిన కోవై సరళ.. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.
Keerthi
‘కోవై సరళ’.. ఈమె తెలుగు ప్రేక్షకుల అందరికీ సుపరిచితమే. ఒకపప్రుడు తెలుగు సినిమాల్లో ఆమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బ్రహ్మనందం, కోవై సరళ కాంబినేషన్ లో వచ్చిన కామెడా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. అలాగే ఎంతోమంది కామెడియన్ లతో కోవై సరళకు మంచి కామెడీ ట్రాక్ ఉందనే చెప్పవచ్చు. ఆ రోజుల్లో స్టాండ్ అప్ ఫిమేల్ కమెడియన్ లలో కోవై సరళ కూడా ఒకరని చెప్పవచ్చు. ఇక ఒక కామెడియన్ గా కాకుండా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కోవై సరళ అనేక సినిమాల్లో అలరించారు. కానీ, ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో ఆమె కనిపించలేదు. ఇక ఈ మధ్య ‘బాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు కోవై సరళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చిన కోవై సరళ.. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారిలో కోవై సరళ కూడా ఒకరు. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ కచ్చితంగా ఉండాల్సిందే. అంతలా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోవై సరళ. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆమె ఏ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. కాగా, ఇటీవలే బాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక బాక్ లో తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలో నటించగా.. సుందర్ సి ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా మే 3న థియేటర్లలో రిలీజైంది.కాగా, ఈ సినిమాలో కోవై సరళ హీరోకి మేనత్తగా నటించిన తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. ఇకపోతే బాక్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా కోవై సరళ మాట్లాడుతూ.. ఒకప్పుడు కోయంబత్తూరులోని తనను షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట. ఇక కోయంబత్తూరులో సరళ ఉండడంతో.. ఆమెను కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారని తెలిపింది. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్ కమెడిన్ చెప్పుకొచ్చారు. ఇక తన తండ్రి గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు కోవై సరళ. ‘నాకు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడు. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని, ఈ క్రమంలోనే ఓ రోజు ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లగా.. అప్పుడు మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. ఇక అక్కడ ఓ పాట షూటింగ్ జరుగుతోంది. దీంతో అందరూ అక్కడకు వచ్చారు. ఇక ఆ పాటలో నేను బ్యాండు కొడుతూ సందడి చేయాలి.
అయితే అప్పుడు మా నాన్న చనిపోయరని వార్త తెలిసినా ఆ పాటకు డ్యాన్స్ చేశా. ఎందుకంటే.. అది చాలా చిన్న ప్రొడక్షన్. ఆర్టిస్టులంతా అక్కడికి వచ్చారు. ఇక నేను వెళ్లిపోతే షూటింగ్ మొత్తం క్యాన్సిలో చేయాల్సి వస్తుంది. దానివల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్ పూర్తి చేసి నేను అక్కడ నుంచి వెళ్లాను. కానీ, మా నాన్న గారిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. ఆ సమయంలో నన్ను మా బంధువులంతా విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. కానీ అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్ అయ్యారు. మరి, తన ఫర్సనల్ లైఫ్ లో జరిగిన ఆ విషాధ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.