ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ మృతి

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో అద్భుతంగా అలరించిన ప్రముఖ నటుడు తాజాగా గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో అద్భుతంగా అలరించిన ప్రముఖ నటుడు తాజాగా గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది.

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వివిధ ఇండస్ట్రీకి చెందిన యంగ్ నటి, నటులు, సీనియర్ నటులు, ప్రముఖ దర్శకులు టెక్నీషియన్లు ఇలా చాలామంది ఆకస్మాత్తుగా మరణిస్తున్నారు. అయితే వీరిలో ఆనారోగ్య సమస్యలతో మరణించినవారు కొందరైతే, మరి కొందరు అనుకోని ప్రమాదాలకు గురవుతు మరణిస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో మాత్రం చాలామంది నటులు అతి చిన్న వయసులోనే గుండేపోటుతో మరణిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో గుండెపోటుతో మరణించిన నటుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రముఖ నటుడు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది.

కోలీవుడ్ నటుడు ‘డేనియల్ డేనియల్’ బాలాజీ (48) హఠత్తుగా కన్నుముశారు. అయితే ఈయనకు మార్చి 29 శుక్రవారం నాడు అర్దరాత్రి ఛాతినొప్పితో అస్వస్థతకు గురియ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుతపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే 48 ఏళ్ల వయసులోనే డేనియల్ బాలాజీ మరణించడం పై సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది.ఇక బాలాజీ మరణంపై ఇండస్ట్రీలోని ప్రముఖులు, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. కాగా, డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక డేనియల్ బాలాజీ తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం 50కి పైగా సినిమాలు చేశాడు. అయితే ఈయన నటించిన సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేశాడు.

ఇక డేనియల్ మొదటగా.. 2001లో ‘చితి’ అనే సీరియల్‏తో బుల్లితెరపైకి అడుగుపెట్టాడు. ఇందులో డేనియల్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత..బాలజీ మొదటగా కమల్ హాసన్ నటించి విడుదల కానీ సినిమా ‘మరుదనాయగం’ సెట్స్ లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలోనే.. 2002లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ ‘మధతిల్’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత.. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘కాకా’, ‘ఫ్రాధు ఫ్రాదు’ వంటి చిత్రాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. అలా చాలా సినిమాల్లో అవకాశాలు అందుకున్న బాలాజీ ఎక్కువగా నెగెటివ్ రోల్స్ లో నటించారు. కాగా, డేనియల్ బాలాజీ.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సిద్దలింగయ్య సోదరి కుమారుడు. అంతేకాకుండా.. నటన మీద ఆసక్తితో చెన్నైలోని తారామణి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్సు పూర్తి చేసిన బాలాజీ నటుడిగా స్థిరపడ్డారు.

అయితే డేనియల్ బాలాజీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సాంబ’ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత.. వెంకటేష్ నటించిన ‘ఘర్షణ’, ‘చిరుత’, నాగ చైతన్య, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాల్లో కీలకపాత్రలలో నటించారు. అలాగే న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాలో మెయిన్ విలన్ గా కూడా నటించారు. కాగా, తెలుగులో బాలాజీ చివరి సినిమా కూడా అదే. అయితే తెలుగు ఆయన చేసినవి తక్కువ సినిమాలైన తనదైన నటనతో బాలాజీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతంగా అలరించిన డేనియల్ బాలాజీ హఠాత్తుగా మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే బాలాజీ భౌతికాయానికి అంత్యక్రియలు ఆయన నివాసం అయిన పురసైవల్కంలోని నిర్వహించనున్నారు.

Show comments