Kichcha Sudeep: హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ తో సుదీప్ కిచ్చా న్యూ మూవీ..

Kichcha Sudeep New Movie With Hanuman Producer: థియేటర్స్ లోకి కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. హనుమాన్ ప్రొడ్యూసర్ తో.. సుదీప్ కిచ్చా ఓ ఇంట్రెస్టింగ్ మూవీ తో రాబోతున్నాడు. తాజాగా దానికి సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Kichcha Sudeep New Movie With Hanuman Producer: థియేటర్స్ లోకి కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. హనుమాన్ ప్రొడ్యూసర్ తో.. సుదీప్ కిచ్చా ఓ ఇంట్రెస్టింగ్ మూవీ తో రాబోతున్నాడు. తాజాగా దానికి సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాని ఈగ సినిమాలో విలన్ గా సుదీప్ కిచ్చా అందరికి మరింత బాగా నోటెడ్ అయిపోయాడు. ఇక ఇప్పడు సుదీప్ కిచ్చా మునుపెన్నడూ లేని విధంగా ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. డైరెక్టర్ అనూప్ భండారి దర్శకత్వంలో.. హనుమాన్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రానుంది. ఆల్రెడీ థియేటర్స్ లో హనుమాన్ ఎలాంటి సక్సెస్ ను అందుకుందో అందరికి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఈ న్యూ మూవీపై కూడా అందరికి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ చూసేద్దాం.

సుదీప్ కిచ్చా కొత్త సినిమా పేరు.. బిల్లా రంగా బాషా(BRB). సుదీప్ కిచ్చా బర్త్ డే సంధర్బంగా.. 2209 A.D లో జరిగే కథను పరిచయం చేస్తున్నట్లుగా ఈ మూవీ పోస్టర్ ను రివీల్ చేశారు. అంతే కాకుండా ఓ కాన్సెప్ట్ వీడియోను రివీల్ చేశారు. దానిని గమనిస్తే.. ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, తాజ్ మహల్ అన్నీ ధ్వంసమైనట్లుగా చూపించారు. అలాగే ఒక వ్యక్తి వీటి అన్నిటిని జయించినట్లుగా చూపించడంతో పాటు.. ఈ కథ అంతా కూడా మూడు వేరు వేరు ప్రాంతాలు , జాతులు , వాతావరణంలో జరిగినట్లు చూపించారు. సో ఈ మూవీ కాన్సెప్ట్ ఎదో ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు బాగానే హిట్ అవుతున్నాయి కాబట్టి.. ఈ సినిమాపై కూడా బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ సంధర్బంగా.. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కిచ్చా సుదీప్‌తో అనూప్‌ భండారి కలయికలో మరో సినిమా రాబోతుందని తెలిసి చాలా ఎగ్జైట్ అయ్యాం. విక్రాంత్ రోనా తెలుగులో విజయవంతమైన సంగతి తెలిసిందే. ది. బిల్లా రంగ బాష కథ విన్నప్పుడు, ఇది మేమే నిర్మించాలని నిర్ణయించుకున్నాం. సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌తో జతకట్టడం అనేది ఎప్పుడూ గొప్ప అవకాశం. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది’ అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ సినిమాపై అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments