గౌరవ డాక్టర్ రేట్ ను వద్దన్న స్టార్ హీరో! హ్యాట్సాఫ్ అంటున్న జనం.. కారణం?

ఓ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టర్ రేట్ ను స్టార్ హీరో తిరస్కరించాడు. ఈ నిర్ణయంతో జనం అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు డాక్టర్ రేట్ ను వద్దన్నాడు? ఆ వివరాలు..

ఓ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టర్ రేట్ ను స్టార్ హీరో తిరస్కరించాడు. ఈ నిర్ణయంతో జనం అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు డాక్టర్ రేట్ ను వద్దన్నాడు? ఆ వివరాలు..

వివిధ రంగాల్లో చేసిన కృషిని గుర్తించి ప్రముఖులకు గౌరవ డాక్టర్ రేట్ లను ప్రకటిస్తూ ఉంటాయి కొన్ని విశ్వవిద్యాలయాలు. అలాగే తాజాగా ఓ యూనివర్సిటీ ఓ స్టార్ హీరోకు గౌరవ డాక్టర్ రేట్ ను ప్రకటించింది. కానీ, దానికి ఆ హీరో సున్నితంగా తిరస్కరించాడు. ఆ స్టార్ తీసుకున్న నిర్ణయానికి జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇంతకీ ఆ హీరో డాక్టర్ రేట్ ను ఎందుకు నిరాకరించాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కిచ్చ సుదీప్.. కన్నడలో స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ మూవీలో విలన్ గా నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు. ఒక పక్క సినిమాలు చేస్తూనే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. సుదీప్ చేస్తున్న మంచి పనులను గుర్తించిన తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ రేట్ ను ప్రకటించింది. కానీ.. ఆ డాక్టర్ రేట్ తనకు వద్దని సున్నితంగా తిరస్కరించాడు. ఇక డాక్టర్ రేట్ వద్దు అనడానికి కారణం సైతం వెల్లడించాడు. సమాజానికి సేవచేసే నా కంటే పెద్ద వాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి డాక్టర్ రేట్ ఇప్పించండి అని యూనివర్సిటీ అధికారులకు చెప్పాడు సుదీప్.

ఈ విషయం కాస్త అభిమానులకు, ప్రజలకు తెలియడంతో.. సుదీప్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సేవచేసే వాళ్లు చాలా మంది ఉన్నారని, వారికి గౌరవ డాక్టర్ రేట్ ఇవ్వమని చెప్పడం గొప్ప విషయం అంటూ సుదీప్ ను పొగుడుతున్నారు. సినిమా రంగానికి, సమాజ సేవకు గుర్తుగా సుదీప్ కు ఈ గౌరవాన్ని ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఇక ఈ డాక్టర్ రేట్ ప్రధానోత్సవం ఆగస్ట్ 17న తుమకూరు యూనివర్సిటీలో జరగనుంది. మరి కిచ్చ సుదీప్ డాక్టర్ రేట్ ను నిరాకరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.

Show comments