Kerala Wayanad Floods 2024-Rashmika Mandanna, Trolls: వయనాడ్‌ బాధితులకు రష్మిక భారీ సాయం.. ట్రోల్‌ చేస్తోన్న నెటిజనులు!

Rashmika Mandanna: వయనాడ్‌ బాధితులకు రష్మిక భారీ సాయం.. ట్రోల్‌ చేస్తోన్న నెటిజనులు!

Kerala Wayanad Floods 2024-Rashmika Mandanna: వయనాడ్‌ బాధితులకు రష్మిక మందన్నా విరాళం ఇవ్వడంపై కొందరు నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

Kerala Wayanad Floods 2024-Rashmika Mandanna: వయనాడ్‌ బాధితులకు రష్మిక మందన్నా విరాళం ఇవ్వడంపై కొందరు నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

భారీ వర్షాలు దైవ భూమి కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో.. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోగా.. వందలాది మంది మృతి చెందారు. వేలాదిగా జనాలు నిరాశ్రయులయ్యారు. వయనాడ్‌లో ఎక్కడ చూసినా వరదలు మిగిల్చిన విలయమే కళ్ల ముందు కనిపిస్తుంది. కుటుంబాలకు కుటుంబాలు గల్లంతయ్యాయి. ఇక వయనాడ్‌ బాధితులను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఇక వయనాడ్‌ బాధితులను ఆదుకోవడం కోసం దేశం అంతా తరలి వస్తోంది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు.. వయనాడ్‌ బాధితులను ఆదుకోవడం కోసం భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. సూర్య, జ్యోతిక, కార్తీలు 50 లక్షలు ఇవ్వగా.. దుల్కర్‌ సల్మాన్‌ 10, ముమ్మట్టి 15, కమల్‌ హాసన్‌ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే టాలీవుడ్‌ నుంచి నాగవంశీ 5 లక్షల రూపాయల సాయం ప్రకటించగా.. రష్మిక 10 లక్షలు విరాళం ఇచ్చింది.

సాయం చేసిన వారిని ఎవరైనా సరే ప్రశంసిస్తారు. కానీ రష్మిక విషయంలో మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. వయనాడ్‌ బాధితుల కోసం ఏకంగా 10 లక్షల రూపాయలు సాయం చేసినా.. ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. అందేంటి సాయం చేస్తే మెచ్చుకోవాలి.. కానీ ఇలా విమర్శించడం ఏంటంటే..

రష్మిక కన్నడ భామ. అయితే అక్కడ కొడుగు గాట్‌ సెషన్‌లలో.. భూమి క్షీణత జరగుతోంది. దీనిపై స్పందించాల్సిందిగా ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో అభ్యర్థిస్తున్నారు. భూమి క్షీణించడం వల్ల అక్కడ కూడా కొండచరియలు విరిగిపడి.. చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇళ్లు కోల్పోయారు. కానీ వారి విషయంలో స్పందించకుండా.. ఇప్పుడు కేరళ వయనాడ్‌ బాధితులను ఆదుకోవడం కోసం విరాళం ఇవ్వడాన్ని.. కొందరు నెటినులు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత ప్రాంత ప్రజలను ఆదుకోకుండా.. పుట్టిన ఊరిని గౌరవించకుండా.. ఎక్కడో జరిగిన దానికి సాయం చేస్తారా అని ట్రోల్‌ చేస్తున్నారు. అయితే కొందరు దీన్ని తప్పు పడుతున్నారు. సాయం చేయడం ముఖ్యం కదా.. మనం అది కూడా చేయడం లేదు కదా అంటున్నారు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల పునర్నిర్మాణం, పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి సహాయనిధికి సామాన్యులు, సెలబ్రిటీలు భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇదలా ఉంచితే ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇదే కాక ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాలో కూడా యాక్ట్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Show comments