Krishna Kowshik
డైరెక్టర్ కమ్ యాక్టర్ సూర్య కిరణ్ కన్నుమూసిన సంగతి విదితమే. అయితే అతడి మరణానికి కారణాలను వెల్లడించింది కరాటే కళ్యాణి. ఇంతకు ఆమె ఏం చెప్పిందంటే..?
డైరెక్టర్ కమ్ యాక్టర్ సూర్య కిరణ్ కన్నుమూసిన సంగతి విదితమే. అయితే అతడి మరణానికి కారణాలను వెల్లడించింది కరాటే కళ్యాణి. ఇంతకు ఆమె ఏం చెప్పిందంటే..?
Krishna Kowshik
టాలెంటెడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ అనారోగ్య సమస్యలతో సోమవారం మరణించారు. కామెర్ల వ్యాధితో తమిళనాడులోని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. సూర్య కిరణ్ మరణ వార్త తెలియగానే..అటు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నటి కళ్యాణిని వివాహం చేసుకుని.. అభిప్రాయ బేధాలతో విడిపోయాడు. వైవాహిక జీవితం ఫెయిల్, ఇండస్ట్రీలో వరుస అపజయాలు అతడ్ని కుంగుబాటుకు గురి చేశాయని తెలుస్తోంది. మాస్టర్ సురేశ్ పేరుతో బాలనటుడిగా 200లకు పైగా చిత్రాల్లో నటించిన ఈ యాక్టర్.. సత్యం మూవీతో తానేంటో నిరూపించుకున్నాడు. నటి సుజిత ఆయనకు సోదరి అవుతుందన్న విషయం తెలిసిందే.
ధన 51, బ్రహ్మస్త్రం, రాజు భాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు సూర్య కిరణ్. 2010 తర్వాత మెగా ఫోన్ పట్టలేదు. 2017లో మళ్లీ డైరెక్షన్ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. పట్టాలు ఎక్కలేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని.. ఫస్ట్ ఎలిమినేషన్‌లో ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. అయితే అతడి మరణానికి అసలు కారణాలను వెల్లడించింది కరాటే కళ్యాణి. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లలో కరాటే కళ్యాణి కూడా ఒకరు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య కిరణ్ మరణానికి..‘ఫ్యామిలీ డిస్ట్రబ్ అవ్వడంతోనే మానసికంగా కుంగ్రిపోయారు. చెడు అలవాట్లు ఎక్కువయ్యాయి. వాళ్లు విడిపోయినప్పటికీ.. కళ్యాణి గురించి మంచిగా మాట్లాడేవారు. గుండెల నిండా ఆమెను నింపుకున్నారు. ఆమెతో విడాకులు తట్టుకోలేకపోయారు. నాకు ఎవ్వరూ లేరని ఇండస్ట్రీ నుండి దూరంగా ఉన్నారు’ ని చెప్పింది కరాటే కళ్యాణి.
‘సూర్యకిరణ్ మంచి నటుడు, డ్యాన్సర్, సింగర్, డైరెక్టర్. ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా లేవు. కానీ మందు, సిగరెట్ వంటి అలవాట్లకు పడ్డాడు. జాండీస్ రావడం.. ఇక లైఫ్ ఎందుకు అనుకున్నారేమో.. జాగ్రత్తలు తీసుకోకపోయి ఉండొచ్చు. అనారోగ్యం మరింత ముదిరి గుండెపోటు వచ్చి ఉండొచ్చు. అతడు ఇలా మరణించడాన్ని నేను ఊహించలేదు. ఇలాంటి వార్త వింటాననుకోలేదు. సోదరీమణులు అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ హౌస్‌లో నా గురించి అన్ని విషయాలు అడిగేవారు. నన్ను సిస్టర్‌లా చూసుకున్నారు. బయటకు వచ్చాక మా ఇంటికి కూడా వచ్చారు. హైదరాబాద్ వస్తే.. నాకు ఫోన్ చేసేవారు’ అంటూ తమ మధ్య ఉన్న బంధాన్ని వెల్లడించారు కళ్యాణి.