Leelavathi: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్ నటి మృతి!

  • Author Soma Sekhar Published - 07:16 PM, Fri - 8 December 23

చిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మలయాళ యువ నటి లక్ష్మిక సజీవన్ మరణ వార్త మరచిపోక ముందే మరో సీనియర్ నటి మరణించిందన్న వార్తతో ఇండస్ట్రీ షాక్ కు గురైంది.

చిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మలయాళ యువ నటి లక్ష్మిక సజీవన్ మరణ వార్త మరచిపోక ముందే మరో సీనియర్ నటి మరణించిందన్న వార్తతో ఇండస్ట్రీ షాక్ కు గురైంది.

  • Author Soma Sekhar Published - 07:16 PM, Fri - 8 December 23

చిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటి సుబ్బలక్ష్మీ, సీఐడీ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిస్, బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్ లతో పాటుగా తాజాగా మలయాళ యువ నటి లక్ష్మిక సజీవన్ ల మరణాలను మరచిపోకముందే.. మరో విషాదం పరిశ్రమలో చోటుచేసుకుంది. 600 సినిమాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి(87) శుక్రవారం కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి శుక్రవారం నాడు మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు వినోద్ రాజ్ వెల్లడించారు. దీంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా ఆమె వయోభార సమస్యలతో బాధపడుతూ ఉంది. ఈ క్రమంలోనే నేలమంగళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లీలావతి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. కాగా.. ఈమె కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో తొలి మూవీ మర్మయోగితో పాటుగా, కార్తీక దీపం, ఇది కథ కాదు, వాల్మీకి, మరో మలుపు లాంటి చిత్రాల్లో నటించారు. అదీకాక తన సినీ కెరీర్ లో పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఆమె నటనకు గాను ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. లీలావతి మరణ వార్త విని సినీ, రాజకీయ ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు.

Show comments