Keerthi
Hero Darshan: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ కు ఇప్పటి వరకు బెయిల్ మంజూరు అయిన దాఖాలు కూడా లేవు. కానీ, తాజాగా ఈ విషయంలో దర్శన్ కు ఊహించని విధంగా లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు.
Hero Darshan: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ కు ఇప్పటి వరకు బెయిల్ మంజూరు అయిన దాఖాలు కూడా లేవు. కానీ, తాజాగా ఈ విషయంలో దర్శన్ కు ఊహించని విధంగా లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు.
Keerthi
చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ్ ఇప్పటికే జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే. పైగా ఈ కేసుకు సంబంధించి బలమైన సాక్ష్యలు, నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా.. ఈ కేసు విషయంలో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు,నెటిజన్స్ దర్శన్ పై దుమ్మెత్తిపోశారు. అయితే ఇప్పటికే వరకు ఈ కేసులో దర్శన్ కు బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ, తాజాగా ఈ విషయంలో దర్శన్ కు కాస్త లైన్ క్లియర్ అయ్యిందనే చెప్పవచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రస్తుతం ఈ హత్య కేసులో నిందుతుడిగా దర్శన్ బళ్లారీ జైల్లో ఉండగా, అతని ప్రియురాలుతో సహా మరో 15 నిందుతులు పరప్పన జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో అరెస్టయిన నిందితుల జ్యుడీషియల్ కస్టడీ గడువు సెప్టెంబర్ 9న సోమవారంతో ముగియనుంది. దీంతో నటుడు దర్శన్ తో సహా మిగిలిన నిందితులందరికి రేపు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అంతేకాకుండా.. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ మొత్తం 17 మంది నిందితులకు అందజేయనున్నారు.
ఇక ఆ చార్జిషీటు అందిన తర్వాత చాలామంది నిందితులు రేపు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన దర్శన్, పవిత్రగౌడ్ కూడా సోమవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఇన్నాళ్లు నుంచి బెయిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దర్శన్ కు బెయిల్ విషయంలో కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. దీంతో దర్శన్ అభిమానులు కూడా తమ హీరోకు బెయిల్ దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం నిజంగా ఉంటే.. త్వరలోనే దర్శన్ బెయిల్ పేరిట బయటకు వచ్చే అవకాశం ఉంది. మరీ, దర్శన్ కు బెయిల్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందనే సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.