ఎన్నడూ లేని విధంగా సూర్య కెరీర్ లో రూ.130 కోట్ల నష్టం

Kanguva movie: నవంబర్ 14 సూర్య నటించిన కంగువా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ బాహుబలి అని వెయ్యి కోట్లు అందుకుంటుందని మొదటి నుంచి కూడా మేకర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేశారు. కానీ కంగువతో స్టూడియో గ్రీన్ కు పెద్ద దెబ్బ తగిలినట్లు కనిపిస్తుంది. అమరన్ సినిమాను కూడా కంగువ బ్రేక్ చేయలేదని ట్రేడ్ వర్గాలు అంచనా.

Kanguva movie: నవంబర్ 14 సూర్య నటించిన కంగువా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ బాహుబలి అని వెయ్యి కోట్లు అందుకుంటుందని మొదటి నుంచి కూడా మేకర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేశారు. కానీ కంగువతో స్టూడియో గ్రీన్ కు పెద్ద దెబ్బ తగిలినట్లు కనిపిస్తుంది. అమరన్ సినిమాను కూడా కంగువ బ్రేక్ చేయలేదని ట్రేడ్ వర్గాలు అంచనా.

కోలీవుడ్ హీరోకు కంగువాతో పూర్వ వైభవం వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సూర్యను బలంగా నమ్మారు. తెలుగు వారికి సూర్య అడాప్టెడ్ సన్ అనే టాక్ కూడా ఉండడంతో.. కచ్చితంగా తెలుగులో కంగువా మూవీ సక్సెస్ అందుకుంటుందని అనుకున్నారు. పైగా ప్రెస్ మీట్స్ సమయంలో సూర్య పై అంతే ప్రేమను కురిపించారు కూడా. అయితే ఎంత ప్రేమ , అభిమానం ఉన్నా సరే.. కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే మాత్రం ఎవరు ఏమి చేయలేరని కంగువాతో మరోసారి ప్రూవ్ అయింది. నవంబర్ 14 సూర్య నటించిన కంగువా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ బాహుబలి అని వెయ్యి కోట్లు అందుకుంటుందని మొదటి నుంచి కూడా మేకర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేశారు. కానీ కంగువతో స్టూడియో గ్రీన్ కు పెద్ద దెబ్బ తగిలినట్లు కనిపిస్తుంది. అమరన్ సినిమాను కూడా కంగువ బ్రేక్ చేయలేదని ట్రేడ్ వర్గాలు అంచనా.

మొదటి నుంచి కూడా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సౌండ్ లౌడ్ నెస్ తక్కువ , సినిమా రన్ టైం ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ఇలాంటి టాక్ వలన తీవ్రంగా నష్టపోతుంది. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయల వరకు అయిందట. అలాగే ప్రమోషన్స్ ఖర్చులు రూ.50 కోట్లు ఎక్స్ట్రా అయ్యాయని కోలీవుడ్ లో టాక్. టీజర్ నుంచి ప్రమోషన్స్ వరకు జరిగిన హడావిడి సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తంగా కంగువా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 190 కోట్ల వరకు జరిగింది. దీనితో ఈ మూవీకి రూ.195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా ఫిక్స్ చేశారు టీమ్. కానీ రిలీజ్ తర్వాత.. ఆరు రోజుల వరకు కంగువా రూ.90 కోట్ల గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ. 140 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ అది జరిగే పనిలా కనిపించడం లేదు. ఎందుకంటే డిసెంబర్ 5 న అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

ఈ సినిమా మీద ఉన్న హైప్ గురించి తెలియనిది కాదు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయిందంటే ఇక పక్కన ఏ సినిమా ఉన్నా ప్రేక్షకులు కళ్లన్నీ పుష్పరాజ్ మీదే ఉంటాయి. సో కంగువా ఏ మాత్రం కలెక్షన్స్ రాబట్టాలన్నా కూడా ఈలోపే జరగాలి. మహా అయితే ఈ పది, పదిహేను రోజుల్లో ఓ రూ.10 కోట్ల మేర వసూళ్లు చేసే అవకాశం ఉందని.. ఈ లెక్కన ఇంకా రూ.130 కోట్ల లాస్ కనిపిస్తుందని.. ట్రేడ్ పండితుల అంచనా. సూర్య కెరీర్ లో ఇప్పటివరకు ఇన్ని కోట్ల నష్టం చవి చూసి ఉండడని అభిమానులు భావిస్తున్నారు. క్రీస్తు శకం 1000 – 1100 శతాబ్ధాల మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ ఫిలిం హిస్టరీలో గతంలో ఎప్పుడు చూడని ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇండస్ట్రీలోనే టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేశారు. హైప్ పరంగా సినిమా బాగానే ఉన్నా సరే.. రిలీజ్ తర్వాత మాత్రం అనేక కారణాల వలన ఫెయిల్ అయింది. ఇక థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు మూవీ ఏ మేరకు సంపాదిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments