Swetha
OTT లో కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ తో ఎంట్రీ ఇస్తే.. కొన్ని మాత్రం సడెన్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ ఎంటర్ అయింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
OTT లో కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ తో ఎంట్రీ ఇస్తే.. కొన్ని మాత్రం సడెన్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ ఎంటర్ అయింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
Swetha
కొన్ని సినిమాలు OTT లో సడెన్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ కూడా యాడ్ అయింది. కళ్యాణ్ రామ్ రీసెంట్ గా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. కళ్యాణ్ రామ్ , విజయశాంతి ఈ సినిమాలో తల్లి కొడుకులుగా నటించారు. ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కథ రొటీన్ గా ఉన్నా కూడా క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించని రేంజ్ లో ఉందని టాక్ నడిచింది. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్ రిలీజ్ తర్వాత OTT ఎంట్రీ ఇవ్వాల్సిందే. కానీ అవి పలానా టైం కి OTT స్ట్రీమింగ్ అవుతాయని మేకర్స్ ముందుగానే డిసైడ్ చేస్తారు. అయితే కళ్యాణ్ రామ్ మూవీ మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడెన్ గా OTT స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
అయితే, అది ఇండియాలో కాదు. కేవలం యూకే కంట్రీలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ రిలీజ్ అయింది. యూకే దేశంలోని అమెజాన్ ప్రైమ్‌లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అతి త్వరలో ఇండియాలో కూడా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఈ మూవీ అంతా కూడా తల్లి కొడుకుల చుట్టూ జరుగుతుంది. తల్లి ప్రేమ కోసం తపించే కొడుకు.. కొడుకు పనులు నచ్చని తల్లి కథలో ఎమోషన్స్ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ కొనసాగుతుంది. మాజీ ఐపీఎస్ అధికారిణి వైజయంతి కొడుకు అర్జున్ శాఖపట్నంలో గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. కొడుకుపై అసహ్యంతో అర్జున్‌కు దూరంగా ఉంటుంది తల్లి వైజయంతి. కానీ అర్జున్ మాత్రం తల్లిని కలవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అర్జున్ కు ఎదురైన పరిస్థితిలు ఏంటి ? చివరికి వారిద్దరూ కలుస్తారా లేదా ? చివరికి ఏమైంది ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరికొద్ది రోజుల్లోనే ఇండియాలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.