కల్కి పార్ట్ 1 మే 9న కన్ఫర్మ్….పార్ట్ 2 2025 సంక్రాంతికి

మొన్నీమధ్యనే శివరాత్రి సందర్భంగా కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ అని రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు వైజయంతీ యూనిట్. ప్రభాస్ అభిమానులలో వేవ్స్ క్రియేట్ చేసిందా పోస్టర్. జనరల్ ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు.

మొన్నీమధ్యనే శివరాత్రి సందర్భంగా కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ అని రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు వైజయంతీ యూనిట్. ప్రభాస్ అభిమానులలో వేవ్స్ క్రియేట్ చేసిందా పోస్టర్. జనరల్ ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత భారీ చిత్రం ఏదైనా ఉందంటే అది ప్రభాస్ తో, నాగ అశ్విన్ దర్వకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంమీద ఏస్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ చలసాని నిర్మిస్తున్న కల్కి అని మాత్రం చెప్పాలి. గ్రాండెస్ట్ స్కేల్ లో, కళ్ళు తిరిగిపోయే రేంజ్ లో నిర్మాణ కార్యక్రమాలు శరవేగంతో సాగాయి. చిత్రవిచిత్రాలు, ధ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో అమితాబ్, కమల్ హసన్ లాంటి లెజెండ్స్ పార్టిసిపేషన్ తో కల్కి దుమ్ము లేచిపోయేట్టు తయారవుతోందని పరిశ్రమంతా ఒకటే ఊసు.

అసలు నిజం చెప్పాలంటే ఇటువంటి స్కేల్ సినిమా ఇంతవరకూ ఎవ్వరూ చూసే ఉండరని అంటున్నారు. ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అగ్రనిర్మాతగా అశ్వనీదత్ నిర్మాణ సాహసాలు అలాగే ఉంటాయి. ఎవ్వరికీ కొరుకుడు పడవు. అప్పట్లో నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా పరిశ్రమనే భయపెట్టింది. ఆ బడ్జెట్టు, ఆ స్కేల్ సెట్లు, కేస్టింగ్ రేంజ్ చూసి వణికిపోయింది పరిశ్రమ. అలా చేయడమే అశ్వనీదత్ కి అలవాటు. ఇష్టం కూడా.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అనిపించుకున్న నందమూరి తారకరామారావుతో తొలిచిత్రం తన అతి చిన్నవయసులోనే ఖర్చుకి వెనుకాడకుండా తీసి రికార్డు నెలకొల్పిన సంప్రదాయం ఆయనది. తర్వాతి ప్రయాణంలో మరో లెజెండ్ మెగాస్టార్ తో మూడు సినిమాలు నిర్మించి రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు యాబై ఏళ్ళు పూర్తవుతుంటే….ఇండియాలోనే టాపెస్ట్ హీరోగా నిలబడ్డ ఇండియన్ బాహుబలి ప్రభాస్ తో ఆరేడువందల కోట్ల వ్యయంతో కల్కి నిర్మించడమంటేనే ఇదొక చరిత్ర. మహా సాహసం.

అయితే మొన్నీమధ్యనే శివరాత్రి సందర్భంగా కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ అని రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు వైజయంతీ యూనిట్. ప్రభాస్ అభిమానులలో వేవ్స్ క్రియేట్ చేసిందా పోస్టర్. జనరల్ ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇంక సోషల్ మీడియా అయితే సరేసరి. కానీ అందులో కొర్రు ఏం తలెత్తిందంటే……పోస్టర్ మీద రిలీజ్ డేట్ ప్రకటించలేదు అని. మే 9కి రిలీజ్ ఉందా లేదా అనే అనుమానాలు చెలరేగిపోయాయి. ముఖ్యంగా ప్రభాస్ పేన్స్ ఆందోళనలో పడ్డారు. ఇదే విషయాన్ని ఐ డ్రీమ్ అశ్వనీదత్ ని అడిగితే ‘’ అన్ని కార్యక్రమాలు అనుకున్నవి అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తయ్యాయి. గన్ షాట్ గా మే 9నే కల్కి రిలీజ్’’ అని కన్ఫర్మ్ చేశారు. మొదటి బాగం మే9న రిలీజైతే, రెండో భాగం 2025 సంక్రాంతికి విడుదలవుతుందని కూడా అశ్వనీదత్ ఐ డ్రీమ్ తో చెప్పారు. సో….2024, 2025 వరసన ప్రభాస్ ఫేన్స్ కి ఆలిండియాలో పండగే పండగ.

Show comments