Kalki 2898 AD: చిన్నారులకు ‘కల్కి’ మేకర్స్ బంపరాఫర్‌.. అసలు మిస్ అవ్వొద్దు

Kalki 2898 AD-Children To Saw The Movie Set: చిన్నారులకు కల్కి మూవీ మేకర్స్‌ భారీ బంపరాఫర్‌ ప్రకటించారు. ఈ ఛాన్స్‌ అస్సలు మిస్‌ చేసుకోవద్దు అంటున్నారు. ఆ వివరాలు..

Kalki 2898 AD-Children To Saw The Movie Set: చిన్నారులకు కల్కి మూవీ మేకర్స్‌ భారీ బంపరాఫర్‌ ప్రకటించారు. ఈ ఛాన్స్‌ అస్సలు మిస్‌ చేసుకోవద్దు అంటున్నారు. ఆ వివరాలు..

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమా.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే నెల రోజుల కావొస్తుంది. అయితే ఇన్ని రోజుల వ్యవధిలో కల్కిని కొట్టే చిత్రం ఏదీ.. థియేటర్లలో విడుదల కాలేదు. దాంతో ఇండియా వైడ్‌గా కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి.. రేర్‌ రికార్డు దిశగా దూసుకుపోతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఖాతాలో ఆ స్థాయి వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా కల్కి మేకర్స్‌.. చిన్నారులకు బంపరాఫర్‌ ప్రకటించారు. వారికి ఓ గోల్డెన్‌ ఛాన్స్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ అవకాశాన్ని అస్సలు మిస్‌ చేసుకోవద్దని మేకర్స్‌ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఇంతకు ఆ ఆఫర్‌ ఏంటంటే..

కల్కి సెట్‌ను చూసేందుకు చిన్నారులకు అవకాశం కల్పిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కల్కి సినిమా కోసం వేసిన సెట్‌ను చూసేందుకు పిల్లలకు అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇందుకోసం మీరో పని చేయాలి. ఏంటి అంటే.. మీ పిల్లలు కల్కి సెట్‌ చూడాలంటే.. ముందుగా మీ పిల్లలతో కల్కి సినిమా గురించి మాట్లాడించాలి. అందుకు సంబంధించి వీడియోను కల్కి మేకర్స్‌కు పంపించాలి. అలా వచ్చిన వీడియోల్లో బెస్ట్‌ వాటిని సెలక్ట్‌ చేసి.. ఆ పిల్లలకు కల్కి సెట్‌ చూసే అవకాశం కల్పిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైజయంతీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్‌ ద్వారా తెలిపింది.

‘‘మీ చిన్నారులకు కల్కి సెట్స్‌ను చూపించాలనుకుంటున్నారా? మీ చిన్నారి కల్కి గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి మాకు పంపండి. కల్కి సెట్స్‌ను చూసే అద్భుత అవకాశాన్ని పొందండి! మీ వీడియోలకు #ILoveKalki అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేయండి’’ అని సూచించింది. మీ పిల్లలకు ప్రభాస్ నటంచిన సినిమా సెట్స్‌ను చూపించాలనుకుంటున్నారా.. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ పిల్లలతో కల్కి సినిమా గురించి మాట్లాడించి ఒక వీడియోను టీమ్‌కు పంపండి. మీ పిల్లలకు కల్కి చిత్రం సెట్‌ చూపించండి.

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ మీద నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌లతో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. దిశా పటానీ, శోభన కీలక పాత్రల్లో మెరవగా.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్‌లు గెస్ట్‌ రోల్స్‌ చేశారు.

Show comments