‘జైలర్’ బాక్సాఫీస్ దండయాత్ర! 4వ రోజే లాభాల్లోకి..

  • Author ajaykrishna Published - 01:59 PM, Mon - 14 August 23
  • Author ajaykrishna Published - 01:59 PM, Mon - 14 August 23
‘జైలర్’ బాక్సాఫీస్ దండయాత్ర! 4వ రోజే లాభాల్లోకి..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ జైలర్ మూవీ.. రోజురోజుకి బాక్సాఫీస్ లెక్కలు తిరగరాస్తోంది. వరుసగా మూడు రోజుల్లో రూ. 220 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన జైలర్.. నాలుగో రోజు సండే కావడంతో ఊహించని రేంజ్ లో నెంబర్స్ నమోదు చేసింది. దీంతో నాలుగో రోజుతో జైలర్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అవలీలగా తుడిచి పెట్టేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ కామెడీ మూవీ.. రిలీజ్ ముందే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. జైలర్ హైప్ కి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఓ ప్రధాన కారణం.

ఇక భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఆగష్టు 10న.. జైలర్ పాన్ ఇండియా రేంజ్ మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా.. ఓవైపు యాక్షన్ పరంగా ఆకట్టుకుంటూనే.. కామెడీతో అందరిని నవ్విస్తూ సాగడం ప్లస్ అయ్యింది. వెరసి.. సూపర్ స్టార్ రజినీకి, ఆయన ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. అయితే.. జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 124 కోట్ల వరల్డ్ వైడ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా.. నాలుగో రోజునే ఈ టార్గెట్ ని కంప్లీట్ చేసి.. భారీ లాభాల బాటపట్టింది జైలర్. మరి జైలర్ నాలుగో రోజుకి ఎన్ని కోట్లు వసూల్ చేసింది? ఎంత లాభం వెనకేసుకుంది? అనే వివరాల్లోకి వెళ్తే..

  • తమిళనాడు – 82.05Cr
  • ఏపీ, తెలంగాణ – 34.10 కోట్లు (తమిళ వెర్షన్ తో)
  • కర్ణాటక – 31.90 కోట్లు
  • కేరళ – 23.20 కోట్లు
  • రెస్టాఫ్ ఇండియా – 4.50 కోట్లు
  • ఓవర్సీస్ – 125.50 కోట్లు

మొత్తం(వరల్డ్ వైడ్) – 301.25 కోట్లు (148.15 కోట్లు షేర్)

ఈ లెక్కల ప్రకారం.. జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజులకు గాను రూ. 24 కోట్లకు పైగా లాభాలు గడించింది. తెలుగులో రూ. 13 కోట్ల టార్గెట్ తో విడుదలై.. నాలుగు రోజుల్లో రూ. 18 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అంటే.. ఆల్రెడీ తెలుగులో 5 కోట్లకు పైగా లాభాలలో ఉంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. జైలర్ ఆల్రెడీ విడుదలైన అన్ని భాషలలో.. అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ విజయవంతంగా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. మరి జైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments