జాను సినిమాలో ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందంటే

కోలీవుడ్ 96 మూవీకి రీమిక్ గా తెలుగులో శర్వానంద్, సమంత నటించిన సినిమా జాను. ఇక ఈ మూవీలో పై టీనేజ్ జానులా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..

కోలీవుడ్ 96 మూవీకి రీమిక్ గా తెలుగులో శర్వానంద్, సమంత నటించిన సినిమా జాను. ఇక ఈ మూవీలో పై టీనేజ్ జానులా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా ’96’. ఇక ఈ సినిమా 2018లో విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ వర్షం కురిపించింది. బ్యూటీఫుల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాకు తమిళనాట భారీ ఆదరణతో పాటు మంచి హిట్ రికార్డు సృష్టించడంతో ఈ సినిమాను తెలుగులో దిల్ రాజ్ రీమేక్ చేయాలనుకున్నారు. ఇక అనుకున్న విధంగా ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమిక్ చేసి ఫిబ్రవరి 7, 2020న విడుదల చేశారు. కాగా, అందులో శర్వానంద్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే ఈ సినిమాను సి. ప్రేమ్ కుమారే తెరకెక్కించగా.. దిల్ రాజ్ సినిమాను నిర్మించారు.కానీ, ఈ సినిమా తెలుగులో అంతగా హిట్ కాలేకపోయింది. ఇకపోతే ఈ సినిమాలో శర్వానంద్, సమంత చాలా అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమాలో టీనేజ్ జానులా కనిపించిన ఈ అమ్మాయి ఎవరికైనా గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..

కోలీవుడ్ 96 మూవీకి రీమిక్ గా తెలుగులో శర్వానంద్, సమంత నటించిన సినిమా జాను. ఇక ఈ మూవీలో పై టీనేజ్ జానులా కనిపించిన ఈ అమ్మాయి ఎంతమందికి గుర్తుంది.. ఇంతకి ఈ చిన్నది ఎవరు  ఇప్పుడు  ఏం చేస్తుంది. ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జాను సినిమాలో టీనేజ్ హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ పేరు ‘గౌరి జి కిషన్’. ఈ పేరుతో ప్రేక్షకులు గుర్తుపట్టడం కష్టమే కానీ, జాను సినిమాలో టీనేజ్ హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అయితే గౌరి తమిళ్ 96 మూవీలో కూడా టీనేజ్ అమ్మాయిగా కనిపించడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు మొదట బాలనటిగా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత కథనాయికగా మళ్లీ 96 మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జాను మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత.. విజయ్ తో మాస్టర్, ధనుష్ తో కర్ణన్ వంటి సినిమాల్లో వరుసగా నటించింది. అలాగే తెలుగులో మొదటి  హీరోయిన్ గా శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కాగా, ఈ సినిమాలో అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు మాత్రం రావడం లేదు. అయితే ఇటీవలే ఈ చిన్నది హాట్ స్పాట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా ఈ గౌరి తన నటనతో మరోసారి మంచి మార్కులు కొట్టేసింది.

ఇలా తెలుగు, తమిళ్ భాషాలతో పాటు మలయాళంలో కూడా గౌరి రెండు సినిమాలు చేసింది. కానీ, ఎందుకు అందం, అభినయం,టాలెంట్ అన్ని కలగలగిన ఈ చిన్నదానికి ఆఫర్లు రావడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన గ్లామరెస్ ఫోటలను షేర్ చేస్తూ అందర్నీ మంత్ర ముగ్దులను చేస్తుంది గౌరి. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోస్ ను చూస్తే హీరోయిన్ గ్లామర్ కు ఏమాత్రం తీసిపోకుండా అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది గౌరి. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గౌరి లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments