Dharani
సినిమాకు నటీనటులు వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. కానీ ఓ హీరో మాత్రం ఓకే ఒక్క డైలాగ్ చెప్పి 447 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడట. ఆ వివరాలు..
సినిమాకు నటీనటులు వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. కానీ ఓ హీరో మాత్రం ఓకే ఒక్క డైలాగ్ చెప్పి 447 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడట. ఆ వివరాలు..
Dharani
సినిమా రంగంలో హీరోహీరోయిన్లకు భారీగా రెమ్యూనరేషన్స్ ఇస్తుంటారు. కొందరు ఒక్కో సినిమాకు వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర హీరోలకు మాత్రమే భారీగా రెమ్యూనరేషన్ ఇస్తారు. లాల్ సలామ్ సినిమాలో రజనీ కనిపించింది 45 సినిమాలు మాత్రమే.. అందుకు అతడు 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో జైలర్ సినిమాకు ఏకంగా 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ప్రచారం సాగింది. ఇక మన దగ్గర 50-100 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకునే హీరోలు చాలా మందే ఉన్నారు. ఇక తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఓ హీరో ఒకే ఒక్క డైలాగ్‌కు 447 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడట. ఇంతకు ఎవరా హీరో అంటే..
హాలీవుడ్ పాపులర్ యాక్టర్ విన్ డీజిల్ కేవలం ఒక డైలాగ్‌కే ఏకంగా రూ. 447 కోట్లు అందుకున్నాడు. అలా ఒక్క డైలాగ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు విన్ డీజిల్. హలీవుడ్‌లో వచ్చిన మార్వెల్ సినిమాలకు ప్రపంచస్థాయిలో ఏ రేంజ్‌లో అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాటిక్స్ యూనివర్స్‌లోని ఓ పాత్ర పేరే గ్రూట్. చెట్టులా ఉండే యానిమేటెడ్ పాత్ర అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే గ్రూట్ అంటే విపరీతమైన అభిమానం చూపుతారు. అయితే, ఈ చెట్టు లాంటి గ్రూట్ క్యారెక్టర్‌కు సినిమాల్లో ఎలాంటి డైలాగ్స్ ఉండవు.
గ్రూట్ పాత్రకు ఉండే ఒకే ఒక్క డైలాగ్ ఐ యామ్ గ్రూట్. ప్రతి సినిమాలో గ్రూట్‌కి ఈ ఒక్క డైలాగ్ మాత్రమే ఉంటుంది. అయితే, ఈ యానిమేటెడ్ క్యారెక్టర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చింది విన్ డీజిల్ అంట. గ్రూట్ చెప్పేది ఒకే డైలాగ్ అయినా అది డిఫరెంట్ మాడ్యులేషన్స్‌లో ఉంటుంది. కోపం, బాధ, సంతోషం, కౌంటర్స్ ఇలా ఎలాంటి భావోద్వేగం అయినా సరే.. ఈ చెట్టు క్యారెక్టర్ ఐ యామ్ గ్రూట్ అని మాత్రమే చెబుతుంది. దీన్ని అలా అన్ని ఎమోషన్స్‌లో.. వివిధ రకాల మాడ్యులేషన్స్‌లో డబ్బింగ్ చెప్పింది విన్ డీజిల్. అలా ఒక్క డైలాగ్‌కు విన్ డీజిల్ దాదాపుగా రూ. 447 కోట్లు అందుకున్నాడని హాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.
ఈ సినిమాటిక్ యూనివర్సల్‌లో సూపర్ హీరోలతోపాటు గ్రూట్ క్యారెక్టర్ ఉంటుంది. ఇలా ఈ యూనివర్స్‌లోని ఒక్కో సినిమాకు డబ్బింగ్ చెప్పినందుకు గాను విన్ డీజిల్ ఒక్కో సినిమాకు 13 మిలియన్ డాలర్స్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 107 కోట్లు) పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇలా మొత్తంగా అన్ని సినిమాలకు కలిపి 54 మిలియన్ డాలర్స్ అందుకున్నాడట విన్ డీజిల్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 447 కోట్లకుపైగా పారితోషికం అందుకున్నట్లు. ఇలా ఒకే ఒక్క డైలాగ్‌కు వందల కోట్లు అందుకున్న హీరోగా విన్ రికార్డుకెక్కాడు అని హాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్ ఓ సందర్భంలో చెప్పినట్లు కూడా హాలీవుడ్ మీడియా పేర్కొంది. ఆ సంగతి అలా ఉంచితే గ్రూట్ పాత్రకు డైలాగ్ చెప్పిందుకు గాను.. విన్ డీజిల్ భారీగానే పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఎందుకు అంటే ఒక్కో సినిమాకు విన్ డీజిల్ 26 మిలియన్ డాలర్స్ (రూ. 215 కోట్లు) తీసుకుంటాడని సమాచారం.