Aditya N
పవన్ కళ్యాణ్ , క్రిష్ కాంబినేషన్లతో హరి హర వీర మల్లు చిత్రం 2020లో ప్రారంభమైంది. చాలా కాలంగా షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. హరి హర వీరమల్లుకి సీక్వెల్ కూడా ఉంటుందట..
పవన్ కళ్యాణ్ , క్రిష్ కాంబినేషన్లతో హరి హర వీర మల్లు చిత్రం 2020లో ప్రారంభమైంది. చాలా కాలంగా షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. హరి హర వీరమల్లుకి సీక్వెల్ కూడా ఉంటుందట..
Aditya N
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ కాంబినేషన్లతో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమా హరి హర వీర మల్లు చిత్రం 2020లో ప్రారంభమైంది. మొదట్లో షూటింగ్ షెడ్యూల్స్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగాయి. ఆ పైన గ్లింప్స్, పోస్టర్లు సినిమా పై విపరీతమైన బజ్ తో పాటు భారీ అంచనాలను సృష్టించాయి. 17వ శతాబ్దపు నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కు కరోనా మహమ్మారి తరువాత ప్రారంభమయ్యాయి. చాలా కాలంగా షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. హరి హర వీరమల్లుకి సీక్వెల్ కూడా ఉంటుందట. ఈ సినిమా టూ పార్ట్ సీరీస్ గా తెరకెక్కనుందని నిర్మాత ఏ ఏం రత్నం తాజా మీడియా ఇంటరాక్షన్ లో తెలిపారు.
పైన చెప్పుకున్న విధంగా షూటింగ్ లో కరోనా దాడితో పాటు ఫైనాన్స్ సమస్యలు, స్క్రిప్ట్ లో మార్పులు.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పనుల వల్ల కూడా సినిమా షూటింగ్ ఎన్నో సార్లు ఆగిపోయింది. ఇన్ని కారణాలతో నాలుగేళ్ల తర్వాత కూడా ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. ఇటీవల, దర్శకుడు క్రిష్ యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అనుష్కతో కొత్త ప్రాజెక్ట్ ను మొదలుపెట్టారు. దీంతో హరి హర వీర మల్లు సినిమా ఆగిపోయిందని, థియేటర్లలో విడుదల కాదనే పుకార్లు మొదలయ్యాయి. అయితే ఆ పుకార్లలో ఏమాత్రం నిజం లేదని నిర్మాత ఏ ఏం రత్నం చెప్పారు.హరి హర వీరమల్లు సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు వేర్వేరు లొకేషన్‌లలో జరుగుతున్నాయనే అప్‌డేట్‌తో ఆయన ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని అన్నారు. మే నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉందట. మొదట ఓజీ సినిమా షూటింగ్ బ్యాలెన్స్‌ను పూర్తి చేస్తారు, ఆ సినిమా సెప్టెంబర్ 27న విడుదల అవుతుంది. ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు షూటింగ్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా హరి హర వీరమల్లు మొదటి భాగాన్ని 2025 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్న ప్రత్యేక ప్రోమోను హరి హర వీర మల్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మహా శివరాత్రి రోజున ఈ ప్రోమోను విడుదల చేయనున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు. హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్‌ను పాన్-ఇండియా స్టార్‌గా ఎలివేట్ చేయాలని, ఆయన కెరీర్‌కు సహాయపడాలని కోరుకుంటున్నానని ఏ ఏం రత్నం అన్నారు. హరి హర వీర మల్లు సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నామని తెలిపారు.