Swetha
Rakul Preet Singh:సాధారణంగా ఎవరి పెళ్లి విషయంలోనైనా అందరూ ఆసక్తి కనబరుస్తారు. అందులోను సెలెబ్రిటీల వివాహ విషయమైతే.. అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మంచి పేరును సంపాదించుకున్న ఓ నటి పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
Rakul Preet Singh:సాధారణంగా ఎవరి పెళ్లి విషయంలోనైనా అందరూ ఆసక్తి కనబరుస్తారు. అందులోను సెలెబ్రిటీల వివాహ విషయమైతే.. అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మంచి పేరును సంపాదించుకున్న ఓ నటి పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
Swetha
గత సంవత్సరం ఎంతో మంది సినీ నటులు, సెలెబ్రిటీలు వివాహం చేసుకుని.. వారి వ్యక్తిగత జీవితంలో ముందడుగు వేశారు. సహజంగానే సెలెబ్రిటీల వివాహం అంటే.. వారిని పెళ్లి చేసుకోబోయే వారు ఎవరా అనే ఆసక్తి.. అభిమానులకు కలుగుతుంది. వారి గురించి ఏ చిన్న వార్త తెలిసినా అది సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతో మంది సెలెబ్రిటీల గురించి మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇప్పుడు తాజాగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా .. పేరు తెచ్చుకున్న వారిలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి.. తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది. కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆ తరువాత తెలుగులో పరిచయం అయింది ఈ భామ. అయితే, కొంతకాలం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి.. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పి తీరాలి. కాగా, గతంలో రకుల్, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. దీనితో అప్పట్లో వీరివురు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు తెగ వినిపించేవి. అయితే, తాజాగా రకుల్ వాటిని నిజం చేస్తుందని మరో వార్త వినిపిస్తోంది.
పైగా, వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేయనున్నారని.. వీరి వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేశారనే సమాచారం వినిపిస్తోంది. 2021లో ఈ భామ తన ప్రియుడిని అందరికి పరిచయం చేసింది. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఇక 2024లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో గోవా వేదికగా వీరి వివాహం జరగనుందట. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో వేచి చూడాల్సి ఉంది. ఇక రకుల్ విషయానికొస్తే ప్రస్తుతం ఈమె చేతిలో ఎటువంటి ప్రాజెక్ట్స్ లేనట్టే కనిపిస్తున్నాయి. కానీ, నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ.. యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. మరి, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి విషయమై వస్తున్న వార్తలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.