Vaishnavi: పాపం బేబీ వైష్ణవికి కష్టాలే ఇంక ఇలా అయితే

బేబీ సినిమా హిట్టు తన వల్లే అని అంతా తన గొప్పతనమే అని ఫీలవుతుందంట ఆ సినిమా హీరోయిన్‌ వై‍ష్ణవి. తనకు లైఫ్‌ ఇచ్చిన వాళ్లను పట్టించుకోవడం లేదంట..

బేబీ సినిమా హిట్టు తన వల్లే అని అంతా తన గొప్పతనమే అని ఫీలవుతుందంట ఆ సినిమా హీరోయిన్‌ వై‍ష్ణవి. తనకు లైఫ్‌ ఇచ్చిన వాళ్లను పట్టించుకోవడం లేదంట..

దర్శకనిర్మాత కష్టనష్టాలు, సాధకబాధకాలు, వ్యయప్రయాసల కారణంగానే ఏ లాంగ్వేజ్ ఫిల్మ్ అయినా సరే రూపు దిద్దుకుంటుంది. వాళ్లన్ని పాట్లూ పడితే నటీనటుల యాక్టింగ్ టాలెంట్ స్క్రీన్ మీద ఆవిష్కారమవుతుంది. దర్శకనిర్మాతల ఫేట్ బాగుండి సినిమా హిట్ అయితే నటీనటులకి ఫేన్ పాలోయింగ్ పుట్టుకొచ్చి, క్రేజ్, డిమాండ్ వచ్చేస్తాయి. అయితే ఈ ఈక్వేషన్ సినిమా పుట్టిననాటి నుంచి ఉన్నదే. కొత్తగా వచ్చింది కాదు. కానీ ఈ నిజాన్ని తెలుసుకున్న వాళ్లు ఎప్పుడూ దర్శక నిర్మాతలను గౌరవించడం, పూజ్యభావంతో మసలుకోవడం అన్నది సినిమా పరిశ్రమలో రివాజుగా వస్తున్న పద్ధతి. ఎవరైతే ఈ రివాజుని గౌరవించి, పాటించారో వాళ్ళు మాత్రమే సినిమా పరిశ్రమలో నిలద్రొక్కకుని, విజయవంతమైన కెరీర్స్ ని సాధించుకోగలిగారు.

ఒక్క సినిమ హిట్ కాగానే అదంతా తమ గొప్పతనమే అనుకునే అమాయకులు ఎంత ప్రతిభావంతులైన దెబ్బతిన్నారు. కాలగర్భంలో కలసిపోయారు. గర్వం, భేషజం, తల పొగరుకి సినిమి ఇండస్ట్రీకి ఎప్పుడూ చుక్కెదురే. ఇప్పుడీ కోవలోకే వస్తుంది బేబీ సినిమాతో ఫేంలోకి వచ్చిన వైష్ణవి అని అంటున్నారు.

ఎవరైతే వైష్ణవికి లైఫ్ ఇచ్చారో వాళ్ళనే నిర్లక్ష్యం చేసే స్థితికి చేరుకుందని మాట్లాడుతున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు. బేబీ సినిమా తీయడానికి దర్శకుడు సాయి రాజేష్ ఎన్ని మెట్లు ఎక్కి ఎన్ని మెట్లు దిగాడో పరిశ్రమంతటికీ తెలుసు. అలాగే బేబీ సినిమాని అన్నిటికీ తెగించి నిర్మించిన యువ నిర్మాత ఎస్ కె ఎన్ ఎన్ని రిస్కులను తట్టుకుని, చివరికి నివాసముంటున్న అపార్ట్ మెంటును కూడా అమ్ముకుని బేబీ నిర్మించి, తన పట్టుదలతో హిట్ కొట్టిన నిజం అందరికీ తెలిసింది. అటువంటివారు ఎంతో ఎత్తుపల్లాలను ఎదుర్కొని బేబీ తీస్తే, అదంతా తన గొప్పతనమే అన్నట్టుగా బేబీ హీరోయిన్ వైష్ణవి ప్రవర్తిస్తోందట.

కనీసం ఫోన్లు కూడా రిసీవ్ చేసుకోని స్థాయికి వెళ్ళిపోయిందని వినబడుతోంది. ఏమైనా అంటే మేనేజర్ హరిని కాంటాక్ట్ చేయమంటోందని, ఇప్పుడే ఇంత గీర, గర్వం అయితే ఎలా అనే డిస్కషన్ మాత్రం విరివిగా నడుస్తోంది పరిశ్రమలో. పోనీ చేతి నిండా సినిమాలున్నాయా అంటే అదీ లేదు. వైష్ణవి ప్రతీ పాత్రకీ పనికోచ్చేంత స్పేన్ ఉన్న హీరోయిన్ కాదు. బేబీ సినిమా వరకూ వర్కవుట్ అయింది. అది కూడా దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్ కె ఎన్ అహర్నిశల కష్టం, త్యాగంతో బేబీ పూర్తయి, ధియేటర్ల వరకూ వచ్చింది. ఆమె స్టార్ డమ్ వల్ల కానేకాదన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఒక్క వైష్ణవికి మాత్రమే తెలియడం లేదు. పాపం.

కేవలం మేనేజర్ల వల్లే హీరోయిన్ల కెరీర్లు ఉన్నత స్థానానికి చేరుకోగలిగే మంత్రం మేనేజర్ల చేతిలో ఉంటే ఎందరో స్లార్ డమ్ లోకి వెళ్ళిపోయేవారు. దర్శకనిర్మాతలు తలుచుకుని, ఆ రిస్కో, స్టేకో భరించి సినిమా నిర్మాణానికి పూనుకుంటే హీరోలకైనా, హీరోయిన్లకైనా, మరే నటినటులకైనా మోక్షం. ఈ రహస్యాన్ని వైష్ణవి గ్రహిస్తే చాలా మంచిది.

Show comments