Swetha
వార్ 2 నుంచి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చేసాయి. అదేంటో చూసేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ ఫిలిం కావడంతో.. అభిమానులలో ఆసక్తి పెరిగింది. అది కూడా బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ తో కాంబో కాబట్టి ఇంకాస్త ఎక్కువగానే దీని మీద అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తారక్ హృతిక్ కాంబోని స్క్రీన్ మీద చూద్దామా అని అంతా ఎదురుచూస్తున్నారు.

తారక్ బర్త్ డే సందర్బంగా వార్ 2 నుంచి ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి కొద్దీ గంటల్లో ఆ వీడియో సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టించబోతోంది. ఇక అది కాకుండా వార్ 2 నుంచి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చేసాయి. అదేంటో చూసేద్దాం.
జూనియర్ ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ ఫిలిం కావడంతో.. అభిమానులలో ఆసక్తి పెరిగింది. అది కూడా బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ తో కాంబో కాబట్టి ఇంకాస్త ఎక్కువగానే దీని మీద అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తారక్ హృతిక్ కాంబోని స్క్రీన్ మీద చూద్దామా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే వార్ 2 అంటే అన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఏ ఉంటాయని ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యారు. ఇక అది కాకుండా ఇందులో కాస్త షాకింగ్ అనిపించేవి మూవీలో సాంగ్స్. ఏ సినిమాలో అయినా కనీసం నాలుగు సాంగ్స్ అయినా ఉంటాయి. కానీ వార్ 2 లో మాత్రం కేవలం 2 పాటలే ఉన్నాయట. ఒకటి హృతిక్- కియారాపై పాట.. మరొకటి తారక్- హృతిక్ మీద.
ఆల్రెడీ ప్రీతమ్ మ్యూజిక్ డైరక్షన్ లో ఈ పాట కంపోజిషన్ పూర్తయింది. వచ్చేనెల హృతిక్-తారక్ పై ఈ సాంగ్ ను 7 రోజుల పాటు షూట్ చేయబోతున్నారట మేకర్స్. ఇక ఇవి కాకుండా సినిమా మొత్తం మీద ఆరు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. ఇప్పటివరకు ఈ సినిమాను ఆరు దేశాల్లో షూటింగ్ చేశారట. దాదాపు మరికొద్ది రోజుల్లో షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు , ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు మూవీ టీం. ఇక రిలీజ్ తర్వాత ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.