తేజ ‘మిరాయ్’ నుంచి క్రేజి అప్డేట్

హనుమాన్ తర్వాత తేజ సజ్జ రేంజ్ మారిపోయింది. ఇక హనుమాన్ తర్వాత తేజ నటిస్తున్న మూవీ మిరాయ్. ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

హనుమాన్ తర్వాత తేజ సజ్జ రేంజ్ మారిపోయింది. ఇక హనుమాన్ తర్వాత తేజ నటిస్తున్న మూవీ మిరాయ్. ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ప్రస్తుతం తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాను 2డి, 3డి ఫార్మాట్లో మొత్తం 8 భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆల్రెడీ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సో ఇప్పుడు మొత్తం 8 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కావడంతో తేజ సజ్జా ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లే అని అంతా అనుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన గ్లిమ్ప్స్ , పోస్టర్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. చారిత్రిక గుహల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం. ఈ షెడ్యూల్ లో సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ అంతా పాల్గొంటున్నారట. సో దీనితో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. కచ్చితంగా ఈ సినిమా విజువల్ వండర్ గా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఆగష్టు 1 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments