Indian2 Movie: ప్రేక్షకుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ 2 మూవీ మేకర్స్

Indian2 Movie: ప్రేక్షకుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ 2 మూవీ మేకర్స్

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటే అందరు.. భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అనుకోని విధంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో చిత్ర బృందం మరొక కొత్త నిర్ణయం తీసుకుంది.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటే అందరు.. భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అనుకోని విధంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో చిత్ర బృందం మరొక కొత్త నిర్ణయం తీసుకుంది.

1996 లో విడుదలైన భారతీయుడు సినిమాకు.. టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీనే ఫిదా అయిపొయింది. ఆ సమయంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత.. అదే సినిమాకు సిక్వెల్ గా .. కమల హాసన్ , శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ మూవీకి సిక్వెల్ రావడంతో.. అందరికి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ తర్వాత మాత్రం అనుకొని విధంగా ఈ సినిమా అనుకోని విధంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీనితో ఇప్పుడు మేకర్స్ మూవీ రన్ టైమ్ పై.. కొత్త నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

భారతీయుడు2 మూవీ భారీ అంచనాల మధ్యన జూలై12 న రిలీజ్ అయింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వినిపిస్తూ వస్తుంది. దానికి అనేక కారణాలు ఉండగా.. రన్ టైమ్ కూడా ప్రధాన అంశం అని భావిస్తున్నారు కొందరు. దీనితో దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మూవీ రన్ టైమ్ ను తగ్గించాలని మూవీ టీమ్ డిసైడ్ అయ్యారు. దానికోసం మూవీలోని కొన్ని సీన్స్ ను కట్ చేయనున్నారు. అటు ఇటుగా దాదాపు 20 నిమిషాల రన్ టైమ్ ను కట్ చేయనుంది. దీనితో 3 గంటల సమయం ఉన్న సినిమా .. ఇప్పుడు 2 గంటల 40 నిమిషాలకు తగ్గనుంది. ఆల్రెడీ ప్రస్తుతం థియేటర్స్ లో ఈ కొత్త వెర్షన్ మూవీనే ప్లే అవుతుంది. మరి ఇదైనా వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. భారతీయుడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమాకు మొదటి రోజు రూ.56 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక వీకెండ్ అయినా ఈ సినిమా జోరు కొనసాగుతుంది అనుకుంటే అది కూడా జరగలేదు. బుకింగ్స్ ఇంకా తగ్గుముఖం పట్టాయి. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి. ఇక ఇప్పుడు ఎలాగూ రన్ టైమ్ కూడా తగ్గించారు కాబట్టి.. ఇప్పుడైనా సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తారేమో చూడాలి. దీని తరవాత భారతీయుడు 3 చిత్రం కూడా రానుందట. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఇది ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. మరీ ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments