గత 10 ఏళ్లలో గూగుల్ టాప్ సెర్చ్ సెలబ్రిటీలు వీళ్లే! IMDB 100 మంది లిస్ట్ రిలీజ్..

గత 10 ఏళ్లలో గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ ను IMDB విడుదల చేసింది. 100 మంది జాబితాను ప్రకటించింది. మరి ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? తెలుగు హీరోలు ఎంతమందికి స్థానం దక్కింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

గత 10 ఏళ్లలో గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ ను IMDB విడుదల చేసింది. 100 మంది జాబితాను ప్రకటించింది. మరి ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? తెలుగు హీరోలు ఎంతమందికి స్థానం దక్కింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

గూగుల్.. నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో ఏ ప్రశ్నకు ఆన్సర్ కావాలన్న గూగుల్ తల్లిని అడగాల్సిందే. ఇక ప్రతీ సంవత్సరం గూగుల్ లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన సెలబ్రిటీల లిస్ట్ అంటూ ప్రతి ఏడాది IMDB లిస్ట్ ను విడుదల చేస్తుంది. అయితే గడచిన దశాబ్ద కాలంగా(10 ఏళ్లలో) ఎక్కువగా సెర్చ్ చేసిన సినీ సెలబ్రిటీలు ఎవరు? అన్న విషయం తెలుసుకోవాలన్న ఆత్రుత చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో IMDB 100 మంది మోస్ట్ సెర్చ్ డ్ జాబితాను రిలీజ్ చేసింది. ఆ లిస్ట్ లో ఎవరున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

గత పది సంవత్సరాలుగా గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేసింది IMDB. 100 మందితో ఈ లిస్ట్ ను విడుదల చేసింది. అందులో తెలుగు హీరోలకు ఏ ర్యాంకులు దక్కాయో చూద్దాం. ఇక ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరసగా షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5లో నిలిచారు. గత దశాబ్ద కాలంగా వీళ్ల గురించే ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఇక ఈ జాబితాలో టాప్ 20 లో ఏ తెలుగు హీరోకూ చోటు దక్కలేదు. కానీ హీరోయిన్ సమంత మాత్రం 13వ స్థానంలో, తమన్నా 16, నయనతార 18వ ర్యాంకుల్లో నిలిచారు.

ఇక డార్లింగ్ ప్రభాస్ 29వ ప్లేస్ లో నిలిచాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కోసం నార్త్ ఆడియన్స్ ఎక్కువగా సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఇక ఈ లిస్ట్ లో రామ్ చరణ్ 31, అల్లు అర్జున్ 47, ఎన్టీఆర్ 67, సూపర్ స్టార్ మహేశ్ బాబు 72 స్థానాల్లో నిలిచారు. తమిళ హీరోల్లో ధనుష్ 30, విజయ్ 35, రజినీకాంత్ 42, విజయ్ సేతుపతి 43, మాధవన్ 50, కమల్ హాసన్ 54, సూర్య 62, విక్రమ్ 92, అజిత్ 98 స్థానాల్లో నిలిచారు. ఈ సర్వేను వరల్డ్ వైడ్ గా కండక్ట్ చేశారు. మరి ఈ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments