Aditya N
హైదరాబాద్ ను బేస్ చేసుకుని కేవలం 3 కోట్లతో నిర్మించిన ఓ మలయాళం మూవీ తొలి వారంలోనే ఏకంగా 6 కోట్లను వసూల్ చేసింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ ను బేస్ చేసుకుని కేవలం 3 కోట్లతో నిర్మించిన ఓ మలయాళం మూవీ తొలి వారంలోనే ఏకంగా 6 కోట్లను వసూల్ చేసింది. వివరాల్లోకి వెళితే..
Aditya N
భారత సినిమా పరిశ్రమలో మలయాళ సినిమాకు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జానర్, బడ్జెట్ తో సంబంధం లేకుండా తమకు నచ్చిన సినిమాలు తీస్తూ.. వాటిని కమర్షియల్ గా కూడా హిట్లు చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు మలయాళ సినీ దర్శకులు. తాజాగా ఈ జాబితాలోకి చేరిన మలయాళ చిత్రం ప్రేమలు. గిరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించబడింది. అయితే ఈ సినిమా మొదటి వారంలోనే 6 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం విశేషం. కాగా ఈ మలయాళ సినిమాలో హైదరాబాద్ హైలైట్ గా నిలవడమే అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రేమలు సినిమా హైదరాబాద్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా. ఈ సినిమా ప్రధానంగా యువతను ఆకట్టుకునే అంశాలతో సాగుతుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసినా, జీవితం పట్ల ఇంకా సరైన అవగాహన లేని ఓ అబ్బాయికి.. జీవితంతో పాటు కెరీర్ విషయంలో కూడా ఎన్నో ఆశలతో ఉన్న అమ్మాయికీ మధ్య ప్రేమ కథగా తెరకెక్కింది ప్రేమలు. గేట్స్ కోచింగ్, సాప్ట్ వేర్ ఆఫీస్, పార్టీలు, చదువు కోసం ఫారిన్ వెళ్ళడం ఇలా యూత్ ఆడియెన్స్ తమను తాము ఐడెంటిఫై చేసుకునే అంశాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ సినిమా హైదరాబాద్ నేపథ్యంలో తెరకెకక్కడమే. కథలో భాగంగా హైదరాబాద్ లోని టాంక్ బండ్, నెక్లెస్ రోడ్, చార్మినార్, మైండ్ స్పేస్ వంటి ఏరియాలను చాలా చక్కగా చూపించడంతో పాటు సినిమాలోని ఎంటర్టైన్మెంట్ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. మలయాళ వెర్షన్ లో హైదరాబాద్ లో విడుదలైన ఈ సినిమాకి రోజు రోజుకూ మల్టీప్లెక్స్ లలో షోస్ పెరుగుతున్నాయి.
నస్లెన్ కె గఫూర్, మమితా బైజు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మమితా ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణను పొందారు. దర్శకుడు గిరీష్ ఇదివరకు తన్నీర్ మథన్ దినంగల్, సూపర్ శరణ్య వంటి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలకు దర్శకత్వం వహించి మలయాళంలో ప్రముఖ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ చూసి ప్రేమలు తెలుగులో డబ్ చేస్తారని, రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో గట్టి టాక్ వినిపిస్తుంది.
ఇదికూడా చదవండి: Kalki : చరిత్ర సృస్టించబోతున్న “కల్కి 2898AD”! ఇది ప్రభాస్ రేంజ్!