Nagendra Kumar
ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి కెరీరీ చాలా విచిత్రంగా ప్రారంభమైంది. 1999, మార్చి 12న విడుదలైన సుమంత్ ఆర్ట్స్ నిర్మించిన సంచలన విజయం దేవి సినిమాతోనే సినిమాకి మ్యూజిక్ చేసే ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న దేవిని వరించాయి.
ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి కెరీరీ చాలా విచిత్రంగా ప్రారంభమైంది. 1999, మార్చి 12న విడుదలైన సుమంత్ ఆర్ట్స్ నిర్మించిన సంచలన విజయం దేవి సినిమాతోనే సినిమాకి మ్యూజిక్ చేసే ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న దేవిని వరించాయి.
Nagendra Kumar
గత రెండు దశాబ్దాలకు పైబడి సినిమా సంగీత ప్రపంచంలో రిసౌండింగ్ గా ఎవరి పేరైనా వినిపించిందంటే అది ఒక్కటే…అదే దేవి శ్రీ ప్రసాద్. హిట్లు మీద హిట్లు, టాప్ ర్యాంక్ చార్ట్ బస్టర్స్, రికార్డు బ్రేకింగ్ సెన్సేషన్స్…..అన్నిట్లోనూ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ ప్రధానమైన పాత్రనే పోషించాడు. తనదైన మార్క్, తనకే సొంతమైన మార్క్ తో అతి తక్కువ కాలంలో వంద సినిమాలు పూర్తి చేయడమే కాదు, వరల్డ్ వైడ్ మ్యూజికల్ ఈవెంట్స్, స్టేజ్ పెరఫారమెన్సెస్…ఒకటి కాదు, విపరీతమైన యాక్టివిటీని తనదైన చరిత్రగా మలుచుకున్నాడు. మార్చుకున్నాడు. ఇండస్ట్రీలో అందరూ వ్యావహారికంగా దేవిశ్రీ ప్రసాద్ ని దేవి అని పిలుస్తారు. డిఎస్పీ అని కూడా.
ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి కెరీరీ చాలా విచిత్రంగా ప్రారంభమైంది. 1999, మార్చి 12న విడుదలైన సుమంత్ ఆర్ట్స్ నిర్మించిన సంచలన విజయం దేవి సినిమాతోనే సినిమాకి మ్యూజిక్ చేసే ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న దేవిని వరించాయి. ఒకరి ఫెయిల్యూర్ మరొకరి సక్సెస్ అవుతుందంటే నమ్మాలి. నమ్మితీరాలి. దేవి నిర్మించిన ఎంఎస్ రాజు దేవి ముందు స్ట్రీట్ ఫైటర్ అనే సినిమాని లేడీఅమితాబ్ గా తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లలో పేరుపొందిన నటీమణి విజయశాంతితో నిర్మించారు. బి. గోపాల్ దానికి దర్శకుడు. స్ట్రీట్ ఫైటర్ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బతిని, ఎంఎస్ రాజు జీవితాన్ని తలకిందులు చేసింది. స్ట్రీట్ ఫైటర్ ముందు లేడీఅమితాబ్ తోనే కోడి రామక్రిష్ణ దర్వకత్వంలో ఎం. ఎస్ .రాజు నిర్మించిన పోలీస్ లాకప్ పెద్ద హిట్ అయిన తర్వాత కోడి రామక్రిష్ణ వేరే ప్రాజెక్టులో ఎంగేజ్ అయిన కారణంగా తనకు అలవాటు లేని బి.గోపాల్ తో స్ట్రీట్ ఫైటర్ సినిమాని ప్రారంబించేశారు ఎం.ఎస్.రాజు. కోడి రామక్రిష్ణ అప్పట్లో టాప్ లో ఉన్నారు. ఆయనెప్పుడు చేస్తే అప్పుడే సినిమా తీయాలని నిర్మాతలు వెయిట్ చేసే ట్రెండ్ కి కోడిరామక్రిష్ణ అప్పుడు బ్రాండ్ అంబాసిడర్. కానీ పోలీస్ లాకప్ సక్సెస్ ని ఎన్కేష్ చేసుకునే తొందరలో రాజు ఉన్నారు. తొందరలో తడబడి ఫ్లాప్ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు రాజు. తర్వాత కోడి రామక్రిష్ణకి రాజుకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది. తన నిర్మాత తొందరపడి ప్రాజెక్టు చేసి అనవసరంగా ఇబ్బందులు పాలయ్యారనే ఆవేదనే కోపంగా పరిణమించింది.
అస్సలు పైనాన్షియల్ గా టోటల్ వీక్ అయిపోయిన ఎంఎస్ రాజుకి ఎవ్వరూ డేట్స్ ఇవ్వలేదు. ఈయనా అడగలేకపోయారు. ఏదో ఒకటి గ్రాఫిక్స్ తో డివోషనల్ ఫిల్మ్ తీయాలనే సంకల్పంతో ఎమ్ ఎస్ రాజు మళ్ళీ కోడి రామక్రిష్ణనే ఆశ్రయించారు. మొత్తానికి అనునయింపులు, బుజ్జగింపలు పర్వం పూర్తయ్యాక కోడి ఎంఎస్ రాజుకి సినిమా చేయాలని నిర్ణియంచుకున్నారు. అదే దేవి. ఇంతకు ముందు 1995లోనే గ్రాఫిక్స్ తో అమ్మోరు తీసి సంచలనం రేపారు. దాంతో దేవి సినిమాకి కొంతవరకూ క్రేజ్ వచ్చింది. అందులో ఏ స్టారు లేరు. అందరూ అనామకులే. దానికంటూ ఎవరైనా స్టారుంటే అది దర్శకుడు కోడి రామక్రిష్టే. మ్యూజిక్ ఎవరన్న చర్చ వచ్చినప్పుడు రాజ్ కోటి ఫైల్లో ఉన్నారు. అప్పటికే ఎంఎస్ రాజు, కోడి కాంబినేషన్లో శత్రువు, పోలీస్ లాకఫ్ సినిమాలకు హిట్ మ్యూజిక్ ఇచ్చిన రికార్డు వాళ్ళకుంది. కానీ వాళ్ళని దేవికి సెలెక్ట్ చేసుకోవడానికే ఎంఎస్ రాజు స్తోమత సరిపోలేదు.
ఏం చెయ్యాలీ అనుకున్నప్పుడు, తన సినిమాలకు వర్క్ చేసిన రచయిత సత్యమూర్తి ఆరోగ్యం బాగులేని కారణంగా ఎంఎస్ రాజు తరచూ ఆయన్ని చూడ్డానికి ఇంటికి వెళ్ళేవారు. పైన మేడ మీద దేవిశ్రీప్రసాద్ చిన్న కేషియో పెట్టుకుని ఏవో ట్యూన్లు వాయించుకుంటుండేవాడు. అప్పటికే దేవి ఒకటో రెండో ఆల్బమ్స్ కూడా చేశాడు. మేండలిన్ శ్రీనివాస్ దగ్గర శిష్యరికం కూడా ఉంది. సత్యమూర్తితో ఉన్న స్నేహబంధం, తన బలహీనమైన ఆర్దికస్థితి ప్లస్ దేవిశ్రీప్రసాద్ టాలెంట్ మీద నమ్మకంతో ఎంఎస్ రాజు నిర్ణయానికి వచ్చారు. దేవిశ్రీప్రసాద్ నే సంగీత దర్శకుడిగా పెట్టుకోవాలని. ఆరోజుకి దేవిశ్రీప్రసాద్ కి 19 ఏళ్ళు పూర్తిగా నిండాయో లేదో కూడా. కానీ సంగీతదర్శకుడిగా ఛాన్స్ ఇంటికే వచ్చేసింది. ఒకపాటని అప్పటికింకా తెలుగుకి పరిచయం కాని ఉదిత్ నారాయణతో పాడించాలని ఆలోచన వచ్చినా కూడా ఆ ఖర్చులు భరించలేక ఎంఎస్ ఊరుకున్నారు. బాలూగారితోనే పాడించుకున్నారు.
బాలుగారి పాట రికార్డింగ్ అవుతుంటే, బాలు ఆయన సొంత ధోరణిలో ఏదో గమకం వేయాలని అనుకుంటే దేవిశ్రీ ప్రసాద్ అడ్డుకున్నాడు. అభ్యంతరం చెప్పాడు. ‘’వద్దు అంకుల్. నా ఫస్ట్ పిక్చర్ కదా…..బేడ్ నేమ్ వచ్చెస్తుంది నాకు. ఇలాగే పాడండి’’ అని నిర్మొహమాటంగా చెప్పి, తనకి కావాల్సినట్టుగానే పాడించుకున్నాడు. అదీ దేవిశ్రీప్రసాద్ కమిట్ మెంట్.
దేవి నిర్మాణంలో ఎంఎస్ రాజు అష్టకష్టాలు పడ్డారు. సినిమా అగిపోతూ, ఆగిపోతూ సాగింది. ఫైనాన్సులు పుట్టలేదు. ఒక్క కోడి సహకారం తప్పితే మరెవ్వరూ ఆయనకి కోపరేట్ చేయనేలేదు. మొత్తానికి పిల్లిమొగ్గలు వేసివేసి దేవి పూర్తియింది. విడుదలైంది. బ్రహ్మాండం బద్దలైపోయింది. సినిమా బ్లాక్ బస్టర్. లవకుశ చిత్రంతో పోల్చినంత విజయాన్ని సాధించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి పెద్ద అసెట్ అయింది. యువ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ పేరు మారుమోగిపోయింది. అలా దేవిశ్రీప్రసాద్ సంగీతయాత్ర మొదలైంది. ఇంక అక్కడి నుంచి కొంత ప్రయాసలు పడినా, ప్రతీ అడుగూ ఒక సంచలనమైంది దేవిశ్రీప్రసాద్ కెరీర్లో. పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు, పెద్ద డైరెక్టర్లకి డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ జైత్రయాత్ర ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది.