Venkateswarlu
రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని నమోదు చేసింది.
రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని నమోదు చేసింది.
Venkateswarlu
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అయిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. రివ్యూవర్లు సైతం మంచి రివ్యూలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలైంది. విడుదలైన అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించింది. కలెక్షన్ల విషయంలోనూ సక్సెస్ సాధించింది. మొదటి రోజు దాదాపు 10 కోట్ల రూపాయల గ్రాస్‌ను కొల్లగొట్టింది.
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 5 కోట్ల రూపాయలు.. భారతదేశం మొత్తం మీద 7 కోట్ల రూపాయలు.. ఓవర్‌సీస్‌లో 2.9 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల కొల్లగొట్టింది. రెండవ రోజు కూడా చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 4 కోట్ల రూపాయలు.. మిగిలిన భాషల్లో దాదాపు 3 కోట్ల రూపాయలు.. ఓవర్‌సీస్‌లో 2 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా 8.9 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావటంతో ఓవర్‌సీస్‌లో సినిమాకు మంచి స్పందన వస్తోంది. కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతోంది. కాగా, హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ముందుగానే ఫిక్స్ అయింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే, స్ట్రీమింగ్ తేదీ ఖరారు కాలేదు. డిసెంబర్ చివరి వారంలో కానీ, జనవరి మొదటి వారంలో కానీ, మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
విరాజ్(నాని) ఓ పెద్ద ఫొటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూ ఉంటాడు. తనను నిరూపించుకోవటానికి అందమైన ప్రదేశాలను ఫొటోలు తీస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అతడికి యశ్న(మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. యశ్నకు ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం ఉండదు. కానీ, విరాజ్‌తో ప్రేమలో పడిపోతుంది. పెళ్లి కూడా చేసుకుంటుంది. పిల్లల విషయంలో ఇద్దరికీ గొడవ అవుతుంది. యశ్న పిల్లలు వద్దంటుంది. విరాజ్ కావాలంటాడు. తర్వాత విరాజ్ తగ్గి పిల్లలు వద్దులే అంటాడు. కానీ, యశ్న మాత్రం విరాజ్ మీద ప్రేమతో పిల్లలు కనడానికి ఓకే చెబుతుంది. వీరికి ఓ పాప పుడుతుంది. పాప పుట్టుకతో వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అన్నదే మిగిలిన కథ.. మరి, హాయ్ నాన్న సెకండ్ డే కలెక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.