హాయ్ నాన్న రిలీజ్! అటా ఇటా..?

  • Author ajaykrishna Updated - 08:50 AM, Wed - 11 October 23
  • Author ajaykrishna Updated - 08:50 AM, Wed - 11 October 23
హాయ్ నాన్న రిలీజ్! అటా ఇటా..?

ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత.. అదే డేట్ కి పాన్ ఇండియా హీరోల సినిమాలు పోటీగా అనౌన్స్ చేశారంటే ఖచ్చితంగా మీడియం రేంజ్ సినిమాలకు టెన్షన్ తప్పదు. ఎందుకంటే.. ఆ టైమ్ లో థియేటర్స్ కావాల్సినన్ని దొరక్కపోవచ్చు. లేదా ఈ సినిమా కంటే పాన్ ఇండియా రేంజ్ సినిమాల హైప్ ఎక్కువ ఉండొచ్చు. జనాలు కూడా ఒకేసారి మీడియం రేంజ్ మూవీ, పాన్ ఇండియా మూవీ పోటీగా వస్తున్నాయంటే.. పక్కాగా ఎక్కువ మంది దృష్టి పెద్ద సినిమాల వైపే వెళ్తుంది. సో.. మీడియం సినిమాలు ముందు జాగ్రత్తగా పాన్ ఇండియా మూవీకి పోటీ నుండి తప్పుకునే ఆలోచన చేస్తుంటాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ విషయంలో అదే జరుగుతోంది. నాని నటించిన హాయ్ నాన్న మూవీని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. యంగ్ డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్, శృతిహాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమాని 2023 క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 21న రిలీజ్ కి ముందు ప్లాన్ చేశారు. ఈ సినిమాతో పాటు వెంకటేష్ సైందవ్ మూవీ కూడా రిలీజ్ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా క్రిస్మస్ రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం.. సలార్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఫ్యాన్స్, ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే.. సలార్ మూవీ ముందుగా సెప్టెంబర్ రిలీజ్ అనుకోని.. అనూహ్యంగా క్రిస్మస్ కి.. డిసెంబర్ 22కి షిఫ్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా క్రిస్మస్ కి ప్లాన్ చేసిన సినిమాలలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. సలార్ పాన్ ఇండియా మూవీ. పైగా థియేటర్స్ అన్ని దాదాపు ఆ సినిమానే వేసుకుంటాయి. మరి సలార్ కి పోటీగా దిగితే మీడియం రేంజ్ సినిమాలకు నష్టం తప్పదు. కాబట్టి.. సలార్ డేట్ నుండి సైందవ్ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు నాని హాయ్ నాన్న కూడా సలార్ డేట్ కి కాకుండా డిసెంబర్ సెకండ్ వీక్ లో అంటే.. 7 లేదా 8 తేదీన రాబోతుందని సమాచారం. మరి ఫైనల్ గా ఏ డేట్ లాక్ చేస్తారో చూడాలి. సలార్ కి పోటీగా డుంకి ఉన్న విషయం విదితమే. ఇక హాయ్ నాన్న గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments