ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నరి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నరి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

టాలీవుడ్ లో హీరోయిన్స్ కు అవ గింజ అంతా అదృష్టంతో ఉంటే చాలు.. వారు ఏ ఇండస్ట్రీ వాళ్లు అయిన సరే ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా దర్శకు నిర్మాతల దగ్గర నుంచి హీరోలు కూడా ఆ లక్కీ హీరోయిన్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక తెలుగు ప్రేక్షకుల గురించి ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఇండస్ట్రీ వాళ్లనైనా సరే తెలుగు ఆడియాన్స్ ఆదరించి ఆరాధిస్తుంటారు. ఇప్పటికే టాలీవుడ్ లో వివిధ ఇండస్ట్రీకి చెందిన అందాల తారలు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరీ, అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నరి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కేవలం డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ, ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లోని తెరకెక్కనున్న ‘రాజాసాబ్’ హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే ఈమె ఎవరో కనిపెట్టే ఉంటారు. మరీ, ఆమె ఎవరో కాదు.. మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా ఈ చిన్నది తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా తెలుగునాట ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరో సరసన హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. అలాగే మరో పక్క కోలీవుడ్ చియాన్ విక్రమ్ సరసన ‘తంగలన్’ కూడా నటిస్తంది. అంతేకాకుండా.. హిందీలో యుద్ర అనే చిత్రంలో కూడా నటిస్తుంది. ఇలా ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చేతి నిండా సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది మాళవిక.

ఇక మాళవిక బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఒక మలయాళ నటి. అంతేకాకుండా మాళవిక మలయాళ నిమాటోగ్రాఫర్ K. U. మోహనన్ కుమార్తె. ఇకపోతే సినిమాల మీద ఆసక్తి కలిగిన మాళవిక తన తండ్రి ప్రోత్సహంతో మొదటిగా మమ్ముట్టి తనయుడు హీరో దుల్కర్ సల్మాన్ సరసన 2013లో ‘పట్టం పోల్’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే తన నటనతో, అందంతో మంచి మార్కులు వేసుకున్న మాళవిక ఆ తర్వాత 2015లో ‘నిర్ణయకం’ అనే సినిమాలో నటించింది. ఇక ఆ సినిమాలో కూడా మాళవిక మోహనన్ నటనకు మంచి మార్కులు పడటంతో ఇక అప్పటి నుంచి ఈ బ్యూటీకి మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ వంటి భాషల్లో వరుస ఆఫర్స్ వచ్చాయి.

అయితే తమిళ్ లో మాళవిక స్టార్ హీరో విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ధనుష్ తో మారన్, క్రిష్టి వంటి సనిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతానికైతే మాళవిక విక్రమ్ తంగలన్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నేడు మాళవిక పుట్టినరోజు కావడం విశేషం. ఈ క్రమంలోనే.. ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ మాళవిక చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ, మాళవిక చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments