హీరామండి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. మధ్యతరగతి మహిళలు ఆసక్తిగా ఉండరు!

Heeramandi Director Sanjay Leela Bhansali On Middle Class Ladies: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ట్రెండింగ్ లో ఉన్న హీరామండి వెబ్ సిరీస్ డైరెక్టర్, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తాజాగా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు.

Heeramandi Director Sanjay Leela Bhansali On Middle Class Ladies: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ట్రెండింగ్ లో ఉన్న హీరామండి వెబ్ సిరీస్ డైరెక్టర్, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తాజాగా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఒక వెబ్ సిరీస్ గురించి పదే పదే వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అయితే ఆ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఆ సిరీస్ మరేదో కాదు.. ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి.. నిర్మించిన అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ‘హీరామండి’. ఈ డైరెక్టర్ తీసిన ఈ వెబ్ సిరీస్ కు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. అద్భుతంగా ఉంది అంటూ తెగ పొగిడేస్తున్నారు. అయితే వేశ్యలు, వ్యభిచారం నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ పై విమర్శలు కూడా లేకపోలేదు. అయితే తాజాగా ఈ సిరీస్ డైరెక్టర్ భన్సాలీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మధ్యతరగతి మహిళలు అంటే తనకు అసలు ఆసక్తి ఉండదు అంటూ చెప్పడం వివాదానికి తెర లేపింది.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న హీరామండి వెబ్ సిరీస్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. స్వాతంత్రానికి ముందు పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉండే హీరామండి అనే ప్రాంతం పరిస్థితులు, అక్కడి వాతావరణం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ సిరీస్ కి సంబంధించి డైరెక్టర్ భన్సాలీకి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ, ఆయన మిడిల్ క్లాస్ లేడిస్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అలాంటి మహిళలు అంటే తనకు అసలు ఆసక్తి ఉండని చెప్పాడు.

సంజయ్ లీలా భన్సాలీ మాట్లాడుతూ.. “వేశ్యలు, వ్యభిచారిణి, తవాయిఫ్ ఇలా ఏ పేరుతో అయినా మీరు పిలుచుకోండి. కానీ, ఆ వృత్తుల్లో ఉండే మహిళల్లో ఎన్నో రహస్యాలు దాగుంటాయి. వాళ్లు కళాత్మకంగా జీవించే వ్యక్తులు. పాడగలరు, ఆడగలరు, వాళ్లు మనసులో అనుకున్నది నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేయగలరు. వారిలో తెలియని ఒక నిగూఢ శక్తి దాగుంటుంది. వారికి ఈ సంగీతం, నృత్యాన్ని ఆస్వాదించండంలోనే ఎంతో ఆనందం ఉంటుంది. వాళ్లు రసహృదయం కలిగిన వ్యక్తులు. వాళ్లు ధరించే దుస్తులు, ఆభరణాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. వాటికి వాళ్లు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు” అంటూ భన్సాలీ వ్యాఖ్యానించారు.

అలాగే మిడిల్ క్లాస్ మహిళల గురించి మాట్లాడుతూ.. “నాకు మాత్రం అలాంటి పాత్రలే కావాలి. నేను పాఠశాలకు వెళ్లే రోజుల్లో రేషన్ షాపు దగ్గర వరుసలో నిలబడి రేషన్ తీసుకునే మహిళలను చూసే వాడిని. వారికంటే కూడా నాకు ఇలాంటి మహిళలు అంటేనే ఎక్కువ ఆసక్తిగా ఉండేది. వేశ్యలు, సె*క్స్ వర్కర్స్ అంటేనే ఎక్కువ ఆకర్షితుడిని అయ్యేవాడిని. నేను జీవితంలో ఎన్నో అడ్డంకులు దాటుకుని వచ్చాను. నాకు విలాసవంతమైన భవనాలు, గదులు అవసరం లేదు. నేను ఎంతో నిరాడంబరంగా బతికాను” అంటూ హీరామండి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ వ్యాఖ్యానించారు. మరి.. మధ్యతరగతి మహిళలు ఆసక్తిగా ఉండరు అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments