విజయ్‌కాంత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన మంత్రి..

అనారోగ్యం కారణంగా విజయ్‌కాంత్‌ తాజాగా చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఇక, ఆయన ఆరోగ్యం విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి...

అనారోగ్యం కారణంగా విజయ్‌కాంత్‌ తాజాగా చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఇక, ఆయన ఆరోగ్యం విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి...

తమిళ స్టార్‌ హీరో విజయ్‌కాంత్‌ అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిరోజుల క్రితం ఆపరేషన్‌ చేయించుకున్నారు. అయితే, అనుకోని విధంగా మళ్లీ ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. విజయ్‌కాంత్‌ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు.

ఆయనకు ఏమవుతుందా అని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణియన్‌.. విజయ్‌కాంత్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. విజయ్‌కాంత్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాకు విజయ్‌కాంత్‌ ఆరోగ్యం గురించిన హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. మంత్రి సుబ్రహ్మణియన్‌ మాట్లాడుతూ.. ‘‘ విజయ్‌కాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. డాక్టర్లు ఆయన్ని ఐసీయూ ఉంచి చికిత్స చేస్తున్నారు.

విజయ్‌కాంత్‌ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను అస్సలు నమ్మవద్దు. ప్రస్తుతం రెగ్యులర్‌ చికిత్స సాగుతోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు,మూడు రోజుల్లో విజయ్‌కాంత్‌ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అవుతారు’’ అని తెలిపారు. దీంతో విజయ్‌కాంత్‌ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్‌ పడినట్లు అయింది. కాగా, రజినీకాంత్‌ ఒకప్పుడు రజినీకాంత్‌తో పోటీ పడి సినిమాలు చేశారు. స్టార్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

పోలీస్‌ పాత్రల్లో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన చాలా సినిమాలు తెలుగులో డబ్‌ అయి విజయాన్ని సాధించాయి. విజయ్‌కాంత్‌ కొన్ని తెలుగు సినిమాలను తమిళంలోకి రీమేక్‌ కూడా చేశారు. సింహాద్రి సినిమాను గజేంద్ర పేరిట రీమేక్‌ చేశారు. సినిమాల్లో స్టార్‌గా ఉన్న సమయంలోనే ‘డీఎమ్‌డీకే’ అనే పార్టీని పెట్టారు.  మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసినపుడు కేవలం ఒక సీటు మాత్రమే వచ్చింది. తర్వాత ఏఐడిఎమ్‌కే పార్టీతో పొట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 20కిపైగా స్థానాల్లో విజయం సాధించారు.

అయితే, విజయ్‌కాంత్‌ తన తాగుడు అలవాటు కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలపై కొన్ని సార్లు దాడి చేసేవారు. ఆ అలవాటు కారణంగానే ఆరోగ్యం కూడా బాగా పాడైంది. కొన్ని నెలల క్రితం ఆయన కాలి బొటన వేలును తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కిడ్నీలు కూడా పాడయ్యాయి. ఆపరేషన్‌ చేయించుకున్నా లాభం లేకపోయింది. ఇప్పుడు మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. మరి, విజయ్‌కాంత్‌ హెల్త్‌ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపలో తెలియజేయండి.

Show comments