Hanuman: హనుమాన్ బాక్సాఫీస్ డే-2 కలెక్షన్.. మాస్ విధ్వంసం ఇది!

సంక్రాంతి బరిలో రంగంలోకి దిగిన చిత్రాలలో భారీ హిట్ గా మొదటి స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం 'హనుమాన్'. ఈ చిత్రం రెండవ రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

సంక్రాంతి బరిలో రంగంలోకి దిగిన చిత్రాలలో భారీ హిట్ గా మొదటి స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం 'హనుమాన్'. ఈ చిత్రం రెండవ రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

హనుమాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రెండవ రోజు.. భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ప్రశాంత్ వర్మ సృష్టించిన అద్భుతం ‘హనుమాన్’. ఈ సంక్రాంతికి విడుదలైన బడా హీరోల చిత్రాలను ఓడించి.. ఇప్పుడు హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరాల్సిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లోను ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు ప్రశాంత్ వర్మ పైనే ఉంది. అతి తక్కువ బడ్జెట్ తో ఇండస్ట్రీకి ఓ భారీ హిట్ ను అందించాడు. పురాణ ఇతిహాసాల్లోని కొన్ని అంశాలను ఎంతో అద్భుతంగా చూపించి.. ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని కలిగించాడు ప్రశాంత్ వర్మ. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్లు రాబట్టింది. ఇక రెండవ రోజులు కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

“హనుమాన్” చిత్రం విడుదలై రెండు రోజులు అయింది. ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరినుంచి ఈ మూవీ గురించి నెగెటివ్ టాక్ వినిపించలేదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన అద్భుతమే దీనికి కారణం. విడుదలైన ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించి.. మొదటి రోజు రూ. 21 కోట్ల కలెక్షన్లను వసూళ్ళు చేసింది. టాప్ హీరోల అభిమానులను సైతం తన వైపు తిప్పుకునేంత అద్భుతంగా తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ . ఇక రెండవ రోజు హనుమాన్ మొత్తంగా రూ. 12.45 కోట్లు రాబట్టిందని సమాచారం. ఇక మూడవ రోజు కూడా ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించడం ఖాయం. సంక్రాంతి బరిలో ఏ సినిమా ఆకట్టుకుందా అని ఎదురు చూసిన అభిమానులకు.. హనుమాన్ ద్వారా దర్శకుడు వారిని కాలర్ ఎగేరేసుకునేలా చేశాడు. కేవలం రూ.25 కోట్ల తోనే రూపొందించిన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చాలా సునాయాసంగా దాటేయగలదు. ఈ చిత్రంతో ఆడియన్సులో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. తీసింది కొన్ని సినిమాల అయినా తనకంటూ ప్రత్యేక మైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

కాగా, ఈ ఏడాది సంక్రాంతికి మొత్తంగా నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. విడుదుల ముందు పోటీలో ఎవరు గెలుస్తారా అని ఎంతో మంది ఎదురుచూపులు.. హనుమాన్ ప్రీమియర్ షోస్ తోనే సమాధానం చెప్పినట్టు అయింది. రోజు రోజుకి హనుమాన్ చిత్రానికి అభిమానుల సంఖ్య పెరుగుతూ పోతుంది. దర్శకుడు కథకు ఎంత న్యాయం చేశాడో.. నటి నటులు కూడా అంతే న్యాయం చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతటా హనుమాన్ నామ స్మరణే జరుగుతోంది. అంతేకాకుండా వీరి చిత్రం మొదటి రోజు కలెక్షన్లను.. అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లుగా మూవీ టీమ్ ప్రకటించారు. మరి, ‘హనుమాన్’ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments