P Krishna
Hanuman Movie Creates New Record: కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా.. భారీ సక్సెస్ సాధించడమే కాదు.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ఇటీవల పలు సినిమాలు రుజువు చేశాయి.. అలాంటి వాటిలో ‘హనుమాన్’ మూవీ ఒకటి.
Hanuman Movie Creates New Record: కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా.. భారీ సక్సెస్ సాధించడమే కాదు.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ఇటీవల పలు సినిమాలు రుజువు చేశాయి.. అలాంటి వాటిలో ‘హనుమాన్’ మూవీ ఒకటి.
P Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి.. అందులో చాలా తక్కువ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆడియన్స్ కి కంటెంట్ నచ్చాలే కానీ పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంక్రాంతికి పెద్దా, చిన్నా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయి సక్సెస్ టాక్ తెచ్చుకుంటే భారీ వసూళ్లు రాబడతాయి.. ఆ ప్రభావం చిన్న సినిమాలపై పడుతుంటాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నాలుగు సినిమాలు మహేష్ బాబ్ ‘గుంటూరు కారం’, విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’, కింగ్ నాగార్జు నటించిన ‘నా సామిరంగ’మూవీస్ తో పోటీగా కుర్ర హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ మూవీ పోటీ పడింది. అనూహ్యంగా ఈ మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అంతేకాదు సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..
జాంబి రెడ్డి లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తనదైన మార్క్ చాటుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. పెద్ద హీరోలతో పోటీ పడి హిట్ టాక్ తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి హనుమాన్ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సంక్రాంతి మూవీగా నిలిచింది. ఈ మూవీ తాజాగా సరికొత్త మైలు రాయిని చేరుకుంది. విడుదలైన 25 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ దాటింది. దీంతో ఈ ఏడాది రూ.300 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇటీవల చిత్ర యూనిట్ అమెరికాలో కూడా సక్సెస్ టూర్ వేశారు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చాయి. కానీ హనుమాన్ మూవీ మాత్రం ఇప్పటికీ ధియేటర్లలో కనక వర్షం కురిపిస్తూ.. కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ప్రభాస్ లాంటి హీరోల రికార్డులు కూడా కనుమరుగయ్యాయి అని అంటున్నారు. ఈ మూవీ 30 రోజుల్లో ఏకంగా 300 సెంటర్స్ లో ఇంకా నడుస్తూనే ఉంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా.. రెండు వారాలకు మించి ధియేటర్లలో ఉండటం లేదు. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు 50 డేస్, 100 డేస్ ఆడితే పెద్ద ఫంక్షన్ చేసేవారు. ఇన్నేళ్ల తర్వాత ఒక చిన్న సినిమాల బ్లాక్ బస్టర్ అందుకొని ఏకంగా 300 ధియేటర్లలో నడుస్తుంది అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. మరి హనుమాన్.. ఓటీటీలో ఎప్పుడు దర్శనమిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#HanuMan completes blockbuster 30 Days at the cinemas and continues its glorious run in 300 centres❤️🔥
Grateful to the audience across the globe for the tremendous response 🙏🏻
A @PrasanthVarma film
🌟ing @tejasajja123#HanuManEverywhere #HanuManRAMpage @Niran_Reddy… pic.twitter.com/qyubbSHdC8— Primeshow Entertainment (@Primeshowtweets) February 11, 2024