Dharani
దర్శకుడు ప్రశాంత్ వర్మకు చేదు అనుభవం ఎదురయ్యిందా అంటే అవుననే అంటున్నారు. ఆయన చేసిన ట్వీటే నిదర్శనం అని చెబుతున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే...
దర్శకుడు ప్రశాంత్ వర్మకు చేదు అనుభవం ఎదురయ్యిందా అంటే అవుననే అంటున్నారు. ఆయన చేసిన ట్వీటే నిదర్శనం అని చెబుతున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే...
Dharani
హనుమాన్ సినిమా ముందు వరకు కూడా ప్రశాంత్ వర్మ అంటే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే హనుమాన్ సినిమాను ప్రకటించాడో అప్పటి నుంచి జనాలకు అతడిపై ఆసక్తి పెరిగింది. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్.. మూవీతో పాటు దర్శకుడి మీద కూడా జనాల్లో ఆసక్తి పెంచింది. ఇక హనుమాన్ రిలీజ్‌తో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్ వర్మ. అతి తక్కువ బడ్జెట్‌తో బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చి.. తన ప్రతిభను చాటుకున్నాడు. దాంతో దేశవ్యాప్తంగా ఇతడి పేరు మార్మోగిపోయింది. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి కనబరిచారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఇప్పుడు హనుమాన్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ యువ దర్శకుడికి చేదు అనుభవం ఎదురయ్యింది. దీని గురించి అతడు ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
హనుమాన్ సినిమా తర్వాత.. దాని సీక్వెల్ జైహనుమాన్ చిత్రం ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ విజయంతో సౌత్‌లోనే కాక బాలీవుడ్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతన్నాడు అని ప్రకటన వచ్చింది. ఈ మూవీకి రాక్షసుడు అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ సినిమా ఆగిపోయిందంటూ ప్రకటన వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో కారణాలు బయటకు తెలియలేదు. ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారు.. ఈ పోస్ట్‌లో ఆయన ఆవేదన వ్యక్తం చేయడమే కాక తనకు జరిగిన చేదు అనుభవం గురించి పరోక్షంగా చెప్పుకొచ్చాడు అంటున్నారు. ఇంతకు ప్రశాంత్ వర్మ ఏమని పోస్ట్ చేశాడంటే.. ‘‘ప్రతి తిరస్కరణ ఏదో ఒకరోజు తిరిగి ఆశీర్వాదం అవుతుంది’’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసింది. రణ్‌వీర్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడం గురించే ప్రశాంత్ వర్మ ఈట్వీట్ చేశాడని చాలా మంది నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రశాంత్ వర్మ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియాలి. కానీ ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఏం కాదన్నా.. ఈ రోజు నిన్ను కాదన్న వాళ్లే రేపు నీ దగ్గరకు వస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
One day you realise every rejection was a blessing in disguise! 🙂
— Prasanth Varma (@PrasanthVarma) July 8, 2024