Guntur Kaaram First Week Collections : రమణ గాడి మాస్ జాతర.. గుంటూరు కారం ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంతో తెలుసా?

రమణ గాడి మాస్ జాతర.. గుంటూరు కారం ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంతో తెలుసా?

థియేటర్లలో రమణగాడి మాస్ జాతర కొనసాగుతోంది. మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు ఫ్యాన్స్ మహేష్ సినిమాకు అండగా నిలిచారు. దీంతో గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

థియేటర్లలో రమణగాడి మాస్ జాతర కొనసాగుతోంది. మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు ఫ్యాన్స్ మహేష్ సినిమాకు అండగా నిలిచారు. దీంతో గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల అనంతరం మీరిద్దరు కలిసి చేసిన సినిమా గుంటూరు కారం. మాస్ యాక్షన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాలతో పాటు మహేష్ ఫ్యాన్స్ లో భారీ అంచానాలు నెలకొన్నాయి. వీరి అంచనాలను నిజం చేస్తూ సంక్రాంతికి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. స్టైలిష్ గా, స్మార్ట్ గా కనిపించే మహేష్ ఈ సినిమాలో మాస్ లుక్ లో దర్శనమిచ్చేసరికి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మొదట మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత టాక్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది.

థియేటర్లలో రమణగాడి మాస్ జాతర కొనసాగుతోంది. మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు ఫ్యాన్స్ మహేష్ సినిమాకు అండగా నిలిచారు. దీంతో గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. థియేటర్లలో విడుదలైన మొదటి రోజే రూ. 94 కోట్లు వసూల్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఆడియెన్స్ నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ భారీ కలెక్షన్ రాబడుతోంది. ఇక వారం రోజుల్లో గుంటూరు కారం సినిమా 212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

గుంటూరు కారం వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ లో 212 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన రీజనల్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మహేష్ అభిమానులు ఇది మా హీరో రేంజ్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ కూడా దక్కించుకుంది. దీంతో వరుసగా 5 రీజనల్ సినిమాలతో 100 కోట్లు షేర్ దక్కించిన ఏకైన హీరోగా కూడా మహేష్ రికార్డ్ సెట్ చేసాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధా కృష్ణ నిర్మించిన గుంటూరు కారంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం కీలక పాత్రల్లో నటించారు. మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.

Show comments