గుణ సినిమా హీరోయిన్‌ ఆ కారణంతో సినిమాలు మానేసింది!

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటించిన ప్రేమ చిత్రాల్లో ‘గుణ’ది ఓ ప్రత్యేక స్థానం. 1991లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. మనుషులకు అర్థం కాని ఈ స్వచ్ఛమైన ప్రేమ కథ అట్టర్‌ ప్లాప్‌గా నిలిచింది. విషాదాలు, అట్లర్‌ ప్లాపులు ప్రేమకు అడ్డుకావని మరోసారి రుజువైంది. ఈ సినిమా ప్లాపు అయినా.. సరిగా కాసులు కురిపించకపోయినా.. ఇప్పటికీ ఎంతో మంది హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా గుణ, ఉమాదేవిల పాత్రలు గుండెల్లో నిలిచిపోయాయి.

ఎంతలా అంటే.. ఉమాదేవి పాత్రలో నటించిన హీరోయిన్‌ రోహిని సినిమా ఇండస్ట్రీకి దూరమై 30 సంవత్సరాలు పైనే అయినా.. ఆమెను ఇప్పటికీ గుర్తు పెట్టుకునేంతలా.. మనసులో ఆరాధించేంతలా… ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిని తీసిన మొదటి సినిమా.. చివరి సినిమా ఇదే.. ఈ సినిమా తర్వాత ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు. పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఆమె ఎందుకు ఒక్క సినిమాతోనే సినిమాలకు దూరం అయ్యారు? సినిమాలు వద్దనుకున్న తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లారు? ఇప్పుడేం చేస్తున్నారు?

ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కమల్‌ సినిమాలోకి..

1990 సమయంలో రోహిని ముంబైలోని ‘‘డైసీ ఇరానీస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌’’లో యాక్టింగ్‌ కోర్స్‌ చేస్తూ ఉన్నారు. అదృష్టమో.. దురదృష్టమో.. తెలీదు కానీ, మొదటి సినిమానే కమల్‌తో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. రోహిని యాక్టింగ్‌  స్కిల్స్‌ నచ్చిన కమల్‌.. పర్సనల్‌గా ఆమెను గుణ సినిమాలో నటించమని కోరారు. ముంబై నుంచి తమిళ చిత్ర పరిశ్రమ ఇంపోర్ట్‌ చేసుకున్న మొదటి నటి ఈమే కావటం విశేషం. 1991 నవంబర్‌ 5న విడుదలైన ఈ సినిమా ప్లాప్‌ అయింది.

అయినప్పటికి రోహిని నటనకు అన్ని వర్గాల వారు ఇంప్రెస్‌ అయ్యారు. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కమల్‌ కూడా రోహిని నటనను మెచ్చారు. తర్వాత ఆయన తీసిన ‘అమర కావ్యం’తో పాటు మరికొన్ని సినిమాల్లో రోహినికి అవకాశం ఇవ్వాలని భావించారు. అయితే, అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలు ఆగిపోయాయి. దీనికి తోడు ‘గుణ’ సినిమా సమయంలో తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా సౌత్‌ చిత్ర పరిశ్రమపై ఆమెకు మంచి అభిప్రాయం లేకుండా పోయింది. అందుకే హిందీ సినిమాల్లో నటించడానికి ముంబై వెళ్లిపోయారు. అక్కడ కూడా ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పాపం ఆమెకు ఎలాంటి అవకాశాలు రాలేదు.

అవకాశాలు రాకపోవటంతో ఆమె ఢీలా పడ్డారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీనే వదిలి పెట్టారు. గుణ సినిమా తర్వాత ఆమె ఏ భాషలోనూ సినిమా తీయలేదు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. ఓపిక, పట్టుదల లేకే రోహిని సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టిందని, లేకుంటే.. సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌ అయ్యేదని అప్పట్లో కొంతమంది పేరు మోసిన సినిమా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. ఎంతో సంతోషంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. మరి, గుణ సినిమాతో ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్న రోహిని ఒక్క సినిమాతోటే ఇండస్ట్రీకి దూరం అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments