విశ్వక్ సేన్‌కి నలుగురు పెద్దలు కావాలట! ఇండస్ట్రీలో ఎవరు లేరా?

విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో నటించిన చిత్రం గామి. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళుతున్న ఈ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా హిట్ కొట్టడంతో తిరుపతి వెళ్లింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ..

విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో నటించిన చిత్రం గామి. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళుతున్న ఈ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా హిట్ కొట్టడంతో తిరుపతి వెళ్లింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ..

విభిన్న కథా చిత్రాల హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం గామి. శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్లిపోతుంది. కొత్త కథ, కథనాలతో సినిమా ఆసాంతం కట్టిపడేస్తోంది. అఘోరాగా విశ్వక్ సేన్ నటన విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.30 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు. చాందినీ చౌదరీ హీరోయిన్‌గా నటించగా.. అభినయ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కొట్టడంతో ఫుల్ ఖుషీలో ఉంది చిత్ర యూనిట్.

ఈ క్రమంలో తిరుపతిని సందర్శించిన చిత్ర యూనిట్.. అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘ సినిమాను బిగినింగ్ నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకు, ఆడియన్స్‌కు థాంక్యూ సోమచ్.. మేము అనుకున్న దాని కన్నా.. చాలా మంచి సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ దొరికింది ఆడియన్స్ దగ్గర నుండి. ఇది నా కెరీర్‌లోనే బిగ్ కలెక్షన్లు అంటున్నారు. కమర్షియల్ సినిమాతో నంబర్స్ చూపించడం వేరు. కానీ ఎక్స్‌పర్‌మెంట్ చిత్రానికి ఇలాంటి కలెక్షన్లు రావడం గ్రేట్ ఎచివ్ మెంట్. ఇప్పటి వరకు ఈ సినిమా చూడని వారు.. థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. కొత్త సినిమా కంటెంటె కావాలనుకున్న వారికి ఈ మూవీ నచ్చుతుంది. మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్’ అని అన్నారు.

‘బుక్ మై షోలో 8/9/10 రేటింగ్స్ ఉన్న చోట బాట్స్ వల్ల సడన్‌గా వన్ రేటింగ్ వచ్చింది. రేటింగ్ తగ్గినప్పటికీ..ఆడియెన్స్ సపోర్టుతో కలెక్షన్లు తగ్గలేదు. ఎన్ని రోజులు ఇదే సినిమా చూస్తాం.. కొత్త సినిమా రావాలి అని అనుకుంటాం. ఆరు సంవత్సరాలు ఛాలెంజ్ లెక్క తీసుకుని..తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమా రావాలి అని చేసిన ప్రయత్నం ఈ సినిమా. మనం సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. కానీ బాట్స్ చేస్తున్నారు. ఇలా ఎవరు చేస్తున్నారో తెలియదు. పట్టించుకోను కూడా. చూడని వాళ్లు లేకుంటే. ప్లీజ్ చూడండి. మా సినిమాకు కూడా నలుగురు పెద్ద మనుషులు వచ్చి.. చూసి మాట్లాడితే బాగుంటుంది.

ఇది మన తెలుగు సినిమా. తెలుగులో ఇలాంటి సినిమా మునుపెన్నడూ రాలేదని కచ్చితంగా చెబుతాను. 10, 20 సంవత్సరాల తర్వాత మనం తెలుగులో గర్వ పడే సినిమా అవుతుంది. నేను ఓవర్ కాన్ఫిడెంట్‌తో మాట్లాడం లేదు. ఈ సినిమా అర్థం కావడం లేదు అంటున్నారు. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. మిగిలిన వాళ్లకు ఎందుకు అర్థమైందో తెలుసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్. దీంతో ఈ సినిమాకు సపోర్టు చేసే ఇండస్ట్రీలో పెద్దలే లేరా.. అన్న ప్రశ్న ఎదురౌతుంది. మొత్తానికి చిన్న సినిమా భారీ హిట్ కొట్టింది.


Show comments