మిడ్ నైట్ నుంచే స్పెషల్ ప్రీమియర్స్.. చూడాలంటే దైర్యం ఉండాల్సిందే

ఫైనల్ డెస్టినేషన్ ఈ ఫ్రాంచైజ్ లో వచ్చే సినిమాలను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. 2000 సంవత్సరంలో ఈ మొదటి మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా చూసి భయపడని వ్యక్తి ఎవరు ఉండరేమో. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి చివరి భాగం రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ఫైనల్ డెస్టినేషన్ ఈ ఫ్రాంచైజ్ లో వచ్చే సినిమాలను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. 2000 సంవత్సరంలో ఈ మొదటి మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా చూసి భయపడని వ్యక్తి ఎవరు ఉండరేమో. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి చివరి భాగం రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

చావును అత్యంత భయంకరంగా చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. అవి ఎంత భయంగా అనిపించినా కూడా మూవీ లవర్స్ మాత్రం కచ్చితంగా చూస్తారు. అలాంటి సినిమాలలో ముందుండేది ఫైనల్ డెస్టినేషన్. 2000 లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత ఈ ఫ్రాంచైజ్ నుంచి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. కొన్ని అనుకోని పరిస్థితుల వలన ఊహించని కారణాల వలన అత్యంత దారుణంగా మనుషులు చనిపోతే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే ఒక్కొక్కరికి గుండెల్లో దడ మొదలవుతుంది. అలాంటిది ఇక తెరపై చూస్తే అంతే సంగతులు. ఇలాంటి సంఘటనలను తెరపై చూపించిన తీరు ఆడియన్స్ ని విభ్రాంతికి గురి చేసింది. అలా 2003, 2006, 2009, 2011లో వరుసగా ఈ ఫ్రాంచైజ్ నుంచి మరో నాలుగు భాగాలు వచ్చి బ్లాక్ బస్టరయ్యాయి.

ఇక ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఈ ఫ్రాంచైజ్ నుంచి చివరి భాగం.. బ్లడ్ లైన్స్ పేరుతో మే 15న రిలీజ్ కు రెడీగా ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు రోజు అర్ధరాత్రి స్పెషల్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ఫస్ట్ షో పడనుంది. ఇలాంటి బెనిఫిట్ షో లో కేవలం స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే దక్కుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాకు కూడా స్పెషల్ ప్రీమియర్స్ దక్కడం అనేది విశేషం. హైదరాబాద్ , విజయవాడ , వైజాగ్ లాంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్పెషల్ ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ ట్రైలర్ విషయానికొస్తే గతంలో వచ్చిన సినిమాలకంటే ఈసారి హింస ఇంకా పెరిగినట్టు కనిపిస్తుంది. ఈ హత్యలు నిద్రలో కూడా వదిలిపెట్టేలా లేవని అనిపిస్తుంది. ఈ సినిమాతో హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ కి ఎండ్ కార్డు పడనుంది. ఇక ఎలాంటి ఎండింగ్ ఇవ్వబోతున్నారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments