Fighter: సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్న ఫైటర్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్

'విమానంలో భారతదేశానికి చెందిన ఎంత మంది ప్రయాణించారు? 90 శాతానికి పైగా ప్రజలు విమానంలో ప్రయాణించలేదు.

'విమానంలో భారతదేశానికి చెందిన ఎంత మంది ప్రయాణించారు? 90 శాతానికి పైగా ప్రజలు విమానంలో ప్రయాణించలేదు.

వార్, పఠాన్, ఫైటర్ చిత్రాలతో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే ఈ దర్శకుడు తెరకెక్కించిన ఫైటర్ చిత్రం అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేక పోతుంది. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపిక ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ, చూడదగిన సినిమా అన్న టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా ఎందుకో భారీ విజయం సాధించడంలో విఫలం అయింది. ఫైటర్ సినిమాను ప్రేక్షకులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ ఇన్ ఫామ్ డైరెక్టర్.

‘విమానంలో భారతదేశానికి చెందిన ఎంత మంది ప్రయాణించారు? 90 శాతానికి పైగా ప్రజలు విమానంలో ప్రయాణించలేదు. అలాంటప్పుడు ఎయిర్ ఫోర్స్ ఆధారిత సినిమా డైనమిక్స్ ను వారు ఎలా అర్థం చేసుకోగలరు? అందుకే మెజారిటీ ఆడియన్స్ కు నా సినిమా అర్థం కాలేదు” అని సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ స్టేట్ మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.

100 కోట్లకు పైగా వెచ్చించి తీసిన ఎయిర్ ఫోర్స్ సినిమాల గురించి ప్రేక్షకులకు అవగాహన లేదని నిందించడం అర్థరహితమని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. వీలైతే సరైన విధంగా సినిమాని తీసి ప్రేక్షకులను మెప్పించాలి కానీ సినిమా పరాజయానికి ప్రేక్షకుల్ని నిందించడం సరి కాదని చాలా మంది సోషల్ మీడియా యూజర్లు సిద్ధార్థ్ ఆనంద్ ను ట్రోల్ చేస్తున్నారు. మరి.. సిద్ధార్థ్ ఆనంద్ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments