తాతకు ఇచ్చిన మాట మర్చిపోయిన రానా! ఆ రీమేక్ పట్టాలెక్కేది ఎప్పుడో?

Rana Daggubati, Venkatesh, Bobbili Raja Movie: ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు హీరో దగ్గుబాటి రానా. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్​తో ఎప్పటికప్పుడు ఆడియెన్స్​కు థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇస్తుంటాడు. అలాంటి రానా అభిమానులకు ఓ విషయంలో బాకీ పడిపోయాడు.

Rana Daggubati, Venkatesh, Bobbili Raja Movie: ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు హీరో దగ్గుబాటి రానా. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్​తో ఎప్పటికప్పుడు ఆడియెన్స్​కు థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇస్తుంటాడు. అలాంటి రానా అభిమానులకు ఓ విషయంలో బాకీ పడిపోయాడు.

ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు హీరో దగ్గుబాటి రానా. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్​తో ఎప్పటికప్పుడు ఆడియెన్స్​కు థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇస్తుంటాడు. స్టోరీ, స్క్రీన్​ప్లే, జోనర్.. ఇలా అన్ని విషయాల్లోనూ కొత్తదనం ఉండేలా కేర్ తీసుకుంటాడు. అందుకే రానా నుంచి ఒక ఫిల్మ్ వస్తుందంటే ఆడియెన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా దానిపై భారీ అంచనాలు పెట్టేసుకుంటారు. రీఫ్రెషింగ్ ఎంటర్​టైన్​మెంట్​ను ఆయన నుంచి కోరుకుంటారు. రానా కూడా తన నటనతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుంటాడు. ఎక్కువగా ఫ్రెష్, డిఫరెంట్ సబ్జెక్ట్స్​కే ఆయన ఓటు వేస్తుంటాడు. ఇలా వైవిధ్యమైన చిత్రాలతో అందర్నీ అలరిస్తున్న రానా.. దగ్గుబాటి అభిమానులకు మాత్రం బాకీ పడిపోయాడు. ఓ సీక్వెల్ చేస్తానని మాట ఇచ్చి పెండింగ్​లో పెట్టేశాడు. తాత రామానాయుడు చిరకాల కోరికను రానా ఎప్పుడు నెరవేరుస్తాడా అని ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ కెరీర్​లో చాలా బ్లాక్​బస్టర్స్ ఉన్నాయి. అయితే వాటిల్లో స్పెషల్​గా నిలిచిన వాటిల్లో ‘బొబ్బిలి రాజా’ ఒకటి. మాస్, యూత్ ఆడియెన్స్​ను ఉర్రూతలూగించిందీ ఫిల్మ్. వెంకీ ఇమేజ్​ను మరింత పెంచింది. సెప్టెంబర్ 14, 1990న రిలీజ్ అయిన ఈ మూవీకి 34 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. బి.గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాను రీమేక్ చేయాలని దివంగత రామానాయుడు అనుకున్నారు. పలు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాట చెప్పుకొచ్చారు. రానా కూడా బాబాయ్ సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే కచ్చితంగా ‘బొబ్బిలి రాజా’ చేస్తానంటూ మాట ఇచ్చారు. ఈ మూవీ రీమేక్​పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడమే గాక ఫ్యాన్స్​లో ఆశలు కల్పించాడు. అయితే క్రమేణా ఇచ్చిన మాటను ఆయన మర్చిపోయాడు.

‘బొబ్బిలి రాజా’కు 34 సంవత్సరాలు పూర్తవడంతో ఈ సినిమా రీమేక్ గురించి మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. తాత కోరికను రానా ఎప్పుడు నెరవేరుస్తాడా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిస్కస్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ రీమేక్ కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. కాగా, ఫారెస్ట్ బ్యాక్​డ్రాప్​లో నడిచే ‘బొబ్బిలి రాజా’లో దివ్య భారతి హీరోయిన్​గా యాక్ట్ చేసింది. తెలుగులో ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. ఆమె గ్లామర్ ‘బొబ్బిలి రాజా’కు హైలైట్​గా నిలిచింది. వెంకీ మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్​ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. ఇసైజ్ఞాని ఇళయరాజా మ్యూజిక్, బీజీఎం మూవీకి బిగ్ ప్లస్ అయ్యాయి. క్లైమాక్స్​లో వచ్చే ట్రైన్ ఫైట్ సీన్ కూడా వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పాలి. ఇక, దీని రీమేక్ సంగతికొస్తే.. రానా మళ్లీ రియాక్ట్ కాలేదు. ఫారెస్ట్ బ్యాక్​డ్రాప్​లో ‘అరణ్య’ లాంటి అడ్వెంచరస్ ఫిల్మ్ చేశాడు. కానీ ‘బొబ్బిలి రాజా’ రీమేక్​ గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరి.. తాత కోరికను రానా నెరవేరుస్తాడా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments