Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ పై ఫేక్ న్యూస్

మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ ను అందుకుని ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ ను అందుకుని ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన సినిమా ఏదైనా ఉందంటే అది “మంజుమ్మెల్ బాయ్స్”. చిదంబరం దర్శకత్వం వహించగా సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మలయాళ సినిమా ఫిబ్రవరి 22 న థియేటర్లలో వచ్చినప్పటి నుండి అటు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో మలయాళ సినిమా గర్వపడేలా చేసింది. సాధారణంగా ఒక సినిమా పెద్ద హిట్ అయినా లేదా మంచి టాక్ వచ్చినా ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. అయితే మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ పై ఫేక్ న్యూస్ తెలుగు ప్రేక్షకులని కాస్త ఆందోళనకు గురి చేసింది.

మామూలుగా అయితే సౌత్ ఇండియన్ సినిమాల వరకూ ఒక సినిమా థియేటర్లలో విడుదలయిన నాలుగు లేదా ఐదు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ఒక సినిమాకు థియేటర్లలో లాంగ్ రన్ వస్తే అప్పుడు ఓటీటీ రిలీజ్ లేట్ చేయడం జరుగుతుంది. మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ ను అందుకుని ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటిది ఏప్రిల్ 5న డిస్నీ హాట్‌స్టార్‌లో మంజుమ్మెల్ బాయ్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తుందని ఫేక్ న్యూస్ నిన్నటి సాయంత్రం నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే చిత్ర బృందం ఆ పుకార్లని ఖండించారు. మే 2024 వరకు మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీలోకి రాదని వారు స్పష్టం చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

కాగా “మంజుమ్మెల్ బాయ్స్” తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 6న థియేటర్లలోకి రానుందని తాజాగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కలిసి ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఓ పక్క తెలుగు వెర్షన్ ను థియేటర్లలో చూడాలని ఆసక్తి ఉన్న ప్రేక్షకులకి “మంజుమ్మెల్ బాయ్స్” త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనే వార్త కాస్త కలవరపెట్టింది. అయితే అది కేవలం పుకారేనని తేలిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పైన చెప్పుకున్న విధంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన “మంజుమ్మెల్ బాయ్స్” 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి మలయాళ చిత్రంగా
నిలిచింది. కాగా ఇప్పటివరకు 2024లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ భారతీయ చిత్రంగా కూడా నిలిచిందీ సర్వైవల్ డ్రామా.

Show comments