ఎక్స్ట్రా జబర్దస్త్ ఇకపై కనిపించదు! ఇంత సడెన్ నిర్ణయానికి కారణం?

Extra Jabardasth: జబర్దస్త్‌ షో అభిమానులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇంద్రజ జడ్జీగా తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇక ఎక్స్‌ట్రా జబర్దస్‌కు సంబంధించి మరింత షాకింత్‌ విషయం తెలిసింది. ఆ వివరాలు..

Extra Jabardasth: జబర్దస్త్‌ షో అభిమానులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇంద్రజ జడ్జీగా తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇక ఎక్స్‌ట్రా జబర్దస్‌కు సంబంధించి మరింత షాకింత్‌ విషయం తెలిసింది. ఆ వివరాలు..

తెలుగు బుల్లితెర మీద ఏళ్ల తరబడి ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోలు జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌. ఈ రెండు షోలు జనాలను ఏళ్ల తరబడి నవ్విస్తూ.. మంచి రేటింగ్‌ సాధిస్తూ అలరిస్తున్నాయి. ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 9.30 తర్వత ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారంటే.. ఈ షోలకు ఉన్న క్రేజ్‌ గురించి అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు షోలు ప్రేక్షకులను అలరించడమే కాక.. ఎందరో కమెడియన్లను పరిచయం చేసింది. ఈ షోల ద్వారా పరిచయమైన వారిలో నేడు ఎందరో సినిమాల్లో కమెడియన్లు, హీరోలుగా రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్‌ షో నుంచి ఇంద్రజ జడ్జీగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ఇకపై కనిపించదు. ఆ వివరాలు..

ప్రారంభంలో జబర్దస్త్‌ షో మాత్రమే ఉండేది. అది మంచి సక్సెస్‌ సాధించడం.. కంటెస్టెంట్ల సంఖ్య​ పెరగడంతో.. ఆ తర్వాత ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను ప్రారంభించారు. ఈ రెండు షోలు గురు, శుక్రవారాల్లో ప్రసారం అయ్యేవి. రెండుగా డివైడ్‌ చేసిన తర్వాత.. కంటెస్టెంట్ల సంఖ్య కూడా పెరిగింది. అనేక మంది కొత్త వారికి అవకాశం లభించింది. ఇక ఏళ్ల తరబడి ఈ రెండు షోలు జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోమోలో షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించారు. ఈ షోను క్లోజ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ వారం కూడా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కంటెస్టెంట్లు కొత్త స్కిట్‌లతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యారు. ఇక ఆటో రాంప్రసాద్‌ స్కిట్‌లో భాగంగా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను క్లోజ్‌ చేస్తున్నారని చెప్పి షాక్‌ ఇచ్చాడు. అయితే ఇది పర్మినెంట్‌గా క్లోజ్‌ చేయడం కాదు. ఇకపై జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ రెండు ఒకే పేరుతో టెలికాస్ట్‌ అవుతాయి. అంటే ఎక్స్‌ట్రా అనే పదాన్ని మాత్రమే తీసేస్తున్నారు. అంతేకాక ఈ రెండు షోల టైమింగ్స్‌ కూడా మార్చారు. ఇకపై ఈ రెండు షోలు జబర్దస్త్‌ పేరుతో.. శుక్ర, శనివారాలు టెలికాస్ట్‌ అవుతాయిని యాంకర్‌ రష్మి చెప్పుకొచ్చింది. జబర్దస్త్‌కు ఎక్స్‌ట్రా అనేది ఇంటి పేరులా మారిందని.. దాన్ని తొలగించడం కాస్త బాధాకరంగా ఉందని.. కానీ ఇకపై సరికొత్త కంటెంట్‌.. సరికొత్త ప్యాకేజ్‌తో మరింతగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తామని చెప్పుకొచ్చారు కంటెస్టెంట్లు. ప్రస్తుతం ఈ ప్రొమో వైరల్‌ అవుతుంది.

Show comments