Arjun Suravaram
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాల్లో నటించి..తనదైన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి తాాజాగా షేర్ చేసుకున్నారు.
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాల్లో నటించి..తనదైన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి తాాజాగా షేర్ చేసుకున్నారు.
Arjun Suravaram
నేడు ఉన్నత స్థితిలో, మంచి పొజిషన్ లో ఉన్న చాలా మంది.. గతంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్ని..చివరకు విజేతలు గా నిలబడ్డారు. అలానే సినీ రంగానికి చెందిన మాములు నటుల నుంచి పెద్ద స్టార్ల వరకు చాలామంది..తమ గతంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలూ తమ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను, కష్టాల గురించి పలు ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా కూడా తన చిన్నతనంలో పడిన ఆర్థిక కష్టాల గురించి షేర్ చేసుకుంది. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘ఐ డ్రీమ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది.
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాల్లో నటించి..తనదైన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తొలుత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కెరీర్ స్టార్టింగ్లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ తెలుగు బ్యూటీ. ఈషా రెబ్బ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించి మెప్పించింది. పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి గుర్తింపు సంపాదించింది.ఇటీవలే త్రీ రోజెస్ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ కి ఈ బ్యూటీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో తన కుటుంబంలో జరిగిన ఆర్థిక పరిస్థితుల గురించి, సినిమాలకు సంబంధించిన విషయాల గురించి షేర్ చేసుకున్నారు. తన బాల్యంలో తమ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిందని తెలిపింది.
ఇంకా ఈ అమ్మడు మాట్లాడుతూ..” మేము క్వార్టర్స్ లో ఉండే వాళ్లం. మా నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అప్పట్లో ఆయన జీతం రూ.500జీతం ఉండేది. మేము ముగ్గురం ఆడ పిల్లలం. నేను, అక్క, చెల్లి ఉండే వాళ్లం. ఓ రోజు మా స్కూల్ లో ఫంక్షన్ జరిగింది. ఆ సమయంలో ఫంక్షన్ కోసం నేను కేవలం రూ.10 తీసుకున్నాను. ఆ రోజు మా ఇంట్లో కేవలం రూ.10 మాత్రమే ఉన్నాయి. అవే తీసుకుని ఫంక్షన్ కి వెళ్లాను ఆర్థిక పరిస్థితి చూసి అలా సర్థుకుపోయాను. అయితే తాము ఇలానే ఉంటే కుదరదని, మా అమ్మ టెక్స్ టైల్ బిజినెస్ పెట్టింది.
నేను కొత్త రకం చీరలు,డ్రెస్ లు రాగానే చుట్టుపక్కల వారికి సైకిల్ మీద వెళ్లి చెబుతుండేదాన్ని. అదే విధంగా డబ్బుల కలెక్షన్లకు కూడా నేనే వెళ్లేదాన్ని. అక్క, చెల్లి బట్టలు మడతలు పెట్టి, కవర్లో పెట్టడం, వాటిని నీటుగా సర్థడం వంటి పనులు చేసే వారు. నేను అమ్మతో పాటు వెళ్లి వస్తువులను తీసుకొచ్చేదాన్ని. జీవితంలో ఎదిగేందుకు అమ్మ పడిన కష్టాన్ని దగ్గర నుంచి చూశాను. అదే నేను నేర్చుకున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే.. కష్టపడాలని బలంగా నమ్మాను” అని తన బాల్యంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చింది.