Aditya N
మార్చి 1 నుంచి ఓటీటీలో అడుగుపెట్టిన ఈగల్ అప్పటి నుంచి ఓటీటీ ప్రపంచాన్ని ఏలుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండ్స్ లో ఈగల్ ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
మార్చి 1 నుంచి ఓటీటీలో అడుగుపెట్టిన ఈగల్ అప్పటి నుంచి ఓటీటీ ప్రపంచాన్ని ఏలుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండ్స్ లో ఈగల్ ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
Aditya N
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలై అభిమానులను అలరించినా, విమర్శకుల నుంచి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కెరీర్ లో ఇంతకు ముందెన్నడూ చేయని ఇంటెన్స్ క్యారెక్టర్లో రవితేజ స్టైలిష్ లుక్, పెర్ఫార్మెన్స్ తో పాటు అద్భుతంగా పండించిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాయి.
మార్చి 1 నుంచి ఓటీటీలో అడుగుపెట్టిన ఈగల్ అప్పటి నుంచి ఓటీటీ ప్రపంచాన్ని ఏలుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండ్స్ లో ఈగల్ ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. కాగా ఇది ఆరంభం మాత్రమేనని, ఓటీటీ రంగంలో ఈ సినిమా కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేయడం ఖాయమని నిర్మాతలు అంటున్నారు. ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ యాప్ లో కూడా ఈగల్ సినిమా స్ట్రీమింగ్ కాబడుతోంది.
పైన చెప్పుకున్న విధంగా రవితేజ నుంచి ప్రత్యేకమైన నటనను రాబట్టిన సహదేవ్ పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంది. ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమా మొత్తం కథనాన్ని నడిపించే పాత్రలో చక్కగా నటించారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే భారీ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కథనంలో అక్కడక్కడా లోటుపాట్లు ఉన్నప్పటికీ… హై టెక్నికల్ స్టాండర్డ్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. రవితేజ అభిమానులకు ఈగల్ సినిమా విపరీతంగా నచ్చగా, ఇతర ప్రేక్షకులకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేసిన కార్తీక్ ఘట్టమనేని… కొన్ని సన్నివేశాలను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కించారని ప్రేక్షకులు అంటున్నారు.