Double iSmart vs Mr. Bachchan Bhagyashri War: డబుల్ ఇస్మార్ట్ vs మిస్టర్ బచ్చన్.. పోటీ పూరీ vs హరీష్ కాదు! ఆ ఇద్దరి మధ్య!

డబుల్ ఇస్మార్ట్ vs మిస్టర్ బచ్చన్.. పోటీ పూరీ vs హరీష్ కాదు! ఆ ఇద్దరి మధ్య!

Double iSmart vs Mr. Bachchan: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగబోతోంది. పంద్రాగస్టుకు రెండు క్రేజీ మూవీస్ రిలీజ్​ కానున్నాయి. అయితే ఇది డైరెక్టర్ల వార్ కాదు.. అసలు పోటీ వాళ్లిద్దరి మధ్యే!

Double iSmart vs Mr. Bachchan: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగబోతోంది. పంద్రాగస్టుకు రెండు క్రేజీ మూవీస్ రిలీజ్​ కానున్నాయి. అయితే ఇది డైరెక్టర్ల వార్ కాదు.. అసలు పోటీ వాళ్లిద్దరి మధ్యే!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగబోతోంది. పంద్రాగస్టుకు రెండు క్రేజీ మూవీస్ రిలీజ్​ కానున్నాయి. అందులో ఒకటి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘డబుల్ ఇస్మార్ట్’. ఇంకొకటి ఆయన శిష్యుడు, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’. ఈ రెండు సినిమాలు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద యుద్ధం తప్పేలా లేదు. ఎందుకంటే రెండు మూవీస్​కు మంచి బజ్ ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సూపర్ హిట్​కు సీక్వెల్ కావడంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. హిట్ కొట్టాలనే కసిలో ఉన్న దర్శకుడు పూరీ ఈ ఫిల్మ్​తో బాక్సాఫీస్​ను షేక్ చేయాలని చూస్తున్నారు.

హరీష్ శంకర్ కూడా ‘మిస్టర్ బచ్చన్’తో ఘనవిజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో గతంలో ‘మిరపకాయ’ లాంటి సాలిడ్ హిట్ పడింది. దీనికి తోడు ‘మిస్టర్ బచ్చన్’ నుంచి బయటకు వచ్చిన టీజర్, సాంగ్స్ మూవీపై మరింత ఎక్స్​పెక్టేషన్స్​ పెంచేస్తున్నాయి. దీంతో ఈ సినిమాను చూడాలని ఆడియెన్స్​ ఎదురు చూస్తున్నారు. రెండు సినిమాలపై మంచి బజ్ ఉండటంతో బాక్సాఫీస్ రేస్​లో ఎవరు విన్నర్​గా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇది హరీష్ వర్సెస్ పూరీ పోటీ కాదు. అసలైన పోటీ జరగబోతోంది హీరోయిన్లు కావ్యా థాపర్, భాగ్యశ్రీ బోర్సే మధ్యేనని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

పంద్రాగస్టుకు హీరోయిన్లు కావ్యా థాపర్-భాగ్యశ్రీ బోర్సే మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఈ ఇద్దరూ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్. కానీ వీళ్ల కెరీర్ ఇంకా సెట్ కాలేదు. పూరీ, హరీష్.. ఇద్దరూ హీరోయిన్స్​ను బాగా చూపిస్తారు. యాక్టింగ్, లుక్స్ పరంగా చాలా కేర్ తీసుకొని మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీళ్ల సినిమాల్లో హీరోయిన్లు చాలా స్పెషల్​గా కనిపిస్తుంటారు. కాబట్టి ఈ మూవీస్​తో ఎవరు మెప్పిస్తారు? ఎవరు క్లిక్ అయి వరుస అవకాశాలు దక్కించుకుంటారనేది చూడాలి. అందుకే ఇది హీరోయిన్ల మధ్య పోటీ అని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. ‘డబుల్ ఇస్మార్ట్’తో వస్తున్న కావ్య, ‘మిస్టర్ బచ్చన్​’తో సిద్ధమైన భాగ్యశ్రీలో ఎవరు బాక్సాఫీస్ ఫైట్​లో విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments